మహబూబాబాద్‌లో త్వరలో టీ- డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
టీ- డయాగ్నస్టిక్ సెంటర్మ | హబూబాబాదులో త్వరలో టీ- డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మహబూబాబాద్ : మహబూబాబాద్‌లో త్వరలో టీ- డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో కొవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం హాస్పిటల్లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటుచేసిన వసతులు, చికిత్సకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల కొంతమందికి ఉన్న అనుమానం తొలగించడం కోసం ఇక్కడ వ్యాక్సిన్ తీసుకొని కొంత ధైర్యం కల్పిద్దాం అని అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వ్యాక్సిన్ కు అద్భుతమైన స్పందన ఉందన్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇక్కడ రోగుల పరీక్షలలో సౌకర్యం కోసం టి – డయాగ్నస్టిక్ హబ్ ను ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు.
అలాగే మే 5, 6 తేదీల్లో మహబూబాబాద్‌లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతున్నామని వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేయించుకున్న తర్వాత వరంగల్ వెళ్లి రావాల్సి వస్తున్నది.
దీనివల్ల పరీక్షల ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. కావున మహబూబాబాద్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కేంద్రాన్ని ఇవ్వమని సీఎం కేసీఆర్‌ను కోరినప్పుడు వెంటనే అంగీకరించి మంజూరు చేశారు. అందుకు వారికి ధన్యవాదాలన్నారు.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రజలు కూడా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారిన తరిమి వేయాలని పిలుపునిచ్చారు. మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, స్థానిక అధికారులు, నేతలు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

