ఈస్ట్‌జోన్ డీసీపీగా కరుణాకర్ బాధ్యతల స్వీకరణ
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పుల్లా కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా పనిచేసిన వెంకటలక్ష్మిని కొద్దిరోజుల క్రితం బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె స్థానంలో కరుణాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
- హైదరాబాద్ నుంచి పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై రాక
- శుభాకాంక్షలు తెలిపిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు
వరంగల్, జనవరి 29(నమస్తేతెలంగాణ) : వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పుల్లా కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా పనిచేసిన వెంకటలక్ష్మిని కొద్దిరోజుల క్రితం బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె స్థానంలో కరుణాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆదివారం వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్న కరుణాకర్ బదిలీపై వెళ్తున్న వెంకటలక్ష్మి నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను వరంగల్ ఈస్ట్ జోన్ పరిధిలోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పాగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌కు చెందిన పుల్లా కరుణాకర్ 2010లో గ్రూపు-1 అధికారిగా పోలీసుశాఖలో చేరారు. మొదట ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లా పొద్దుటూరు డీఎస్పీగా పనిచేశారు. అనంతరం తెలంగాణలో షాద్‌నగర్, జగిత్యాల పోలీసు సబ్ డివిజన్‌తో పాటు సీఐడీ విభాగంలో డీఎస్పీగానూ విధులు నిర్వహించారు. 2017లో అదనపు ఎస్పీగా పదోన్నతిపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో అదనపు డీసీపీ హోదాలో పనిచేశారు. 2021లో ఎస్పీగా పదోన్నతి పొందాక కరుణాకర్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తూ బదిలీపై వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా వచ్చారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

