విధులు బహిష్కరించి జూడాల నిరసన
కోల్‌కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. బుధవారం అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. హత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం దవాఖాన జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయగా జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో డాక్టర్స్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు.
- ఎంజీఎం, జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నా
- మద్దతు పలికిన ఐఎంఏ సభ్యులు, నర్సింగ్ విద్యార్థులు
జనగామ, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా : కోల్‌కతాలో వైద్య విద్యార్థిని హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నా చేశారు. బుధవారం అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. హత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం దవాఖాన జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయగా జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో డాక్టర్స్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్‌కతాలోని ఆర్జీ కార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేస్తే అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు రక్షణ కరువవుతున్నదని, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎంజీఎంలో వైద్య విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థినులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళికి వినతిపత్రం అందజేశారు. ఎంజీఎంలో నిరసనలో ఐఎంఏ సభ్యులు, నర్సింగ్ విద్యార్థులతో పాటు బీజీపీ నేత, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొని మద్దతు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

