జయశంకర్ భూపాలపల్లి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సీఆర్ నగర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటి, మున్సిపాలిటీకి స్వచ్ఛ భారత్ వాహనాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అడిషనల్ కాలెక్టర్ దివాకర్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ కల్లెపు శోభ , మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి , వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాల్గొన్నారు.