నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
ఎస్సై బండి శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండలానికి చెందిన జాట్ రోహిత్ (22) హైదరాబాద్ నుంచి బొలెరో వాహనంలో సామాన్లు తీసుకుని వస్తుండగా నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో టైర్ పంక్చర్ అయింది. దీంతో గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన తన డ్రైవర్‌ను జాకీ తీసుకుని రావాలని రోహిత్ చెప్పాడు. ఈ క్రమంలో దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన దొనికెన్ని రాజేందర్ (27) తన లారీలో హనుమకొండ వైపు వెళ్తూ వీరిని గమనించి సాయం చేసేందుకు రోడ్డుపక్కన వాహనాన్ని ఆపాడు. ముగ్గురూ కలిసి బొలెరో వాహనం వద్ద ఉండగా, హనుమకొండ వైపు నుంచి అతివేగంగా వచ్చిన మరో లారీ వెనుక నుంచి బొలెరోను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

