వరంగల్, డిసెంబర్ 16: ఆమెకు స్నేహ హస్తం అందించే నేస్తం చెలి.. ఆత్మగౌరవ ప్రొడక్ట్. పూర్తి హైజెనిక్ బ్రాండ్.. ‘మనం వాడే వస్తువు మనమే తయారు చేసుకుందాం’ అనే స్పృహతో మార్కెట్లో లభించే ఖరీదైన కార్పొరేట్ కంపెనీలకు దీటుగా మన ఆడబిడ్డలు తయారు చేసే ప్యూర్ లోకల్ ప్రొడక్ట్ శానిటరీ న్యాప్కిన్స్”చెలి’. ప్లాస్టిక్ రహిత ప్యాడ్స్ రూపొందించి తయారు చేస్తున్న స్త్రీ స్వశక్తి విజయం. పది మందికి స్ఫూర్తిదాయక గాథ ఇదీ. ఆత్మైస్థెర్యంతో పోటీ మార్కెట్లో నిలబడ్డారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మార్కెట్లోకి మరింత విస్తరిస్తామని చాలెంజ్ చేస్తున్నారు. మహిళలు సమష్టిగా కష్టపడి ఆత్మైస్థెర్యంతో వేసిన ముంద డుగు వారికి గుర్తింపు తీసుకువచ్చింది. ఏ రంగంలోనైనా రాణిస్తారనే దానికి నిదర్శనంగా నిలుస్తున్న మహిళల సక్సెస్‌పై ప్రత్యేక కథనం.
సుమారు 16 సంవత్సరాల క్రితం 10 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మహిళా పొదుపు సంఘం ఏర్పాటు చేసిన చింత రజిని దినదినాభివృద్ధి చెందారు. ప్రస్తుతం పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. రుద్రమదేవి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆమె ఆత్మైస్థెర్యంతో స్వయం గా రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టి శానిటరీ న్యాప్కిన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకొని మార్కెటింగ్ రంగంలో అనుభవం లేనప్పటికీ ఆత్మ విశ్వాసంతో తమ ప్రొడక్ట్‌ను మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్వశక్తితో మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లో నెలకు 10వేల ప్యా కెట్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు విక్రయాలు చేస్తున్నారు.
తయారీలో శిక్షణ
గుజరాత్ రాష్ట్రం ఆహ్మదాబాద్ సంస్థలకు చెందిన శిక్షకులు శానిటరీ న్యాప్కిన్స్ తయారీలో శిక్షణ ఇచ్చారు. కొంత మంది మహిళా సంఘం సభ్యులు అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడి అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఇందులో శిక్షణ తీసుకున్నారు. హైజెనిక్ న్యాప్కిన్ ప్యాడ్ తయారీలో శిక్షణ పొందిన మహిళలు తమ సొంత పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేశారు. మెప్మా అందిస్తున్న సహకారంతో వారు న్యాప్కిన్ తయారీలో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
10 మందికి ఉపాది
చెలి శానిటరీ న్యాప్కిన్స్ యూనిట్లో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నెలకు రూ. 6500 వేతనంతో వీరు పనిచేస్తున్నారు. ప్రతి నెల సుమారు 5 వేల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. సొంత పెట్టుబడితో ఏర్పాటు చేసిన రుద్రమదేవి పట్టణ సమాఖ్య అద్యక్షురాలు చింత రజిని యూనిట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆమె స్వయంగా లోకల్ మార్కెటింగ్ చేస్తూ ఉత్పత్తులను విక్రయి స్తున్నారు. ప్రతి నెలా సుమారు 5 వేల ప్యాకెట్ల వరకు విక్రయిస్తున్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ చేయూత
చెలి న్యాప్కిన్ప్ ఉత్తత్తులను గ్రేటర్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తున్నది. ప్రతి 1250 ప్యాకెట్లను కొను గోలు చేసి ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులకు అందజేస్తున్నది. దీంతో పాటు స్థానిక మార్కెట్‌తో మార్కెటింగ్ చేస్తూ నిలదొక్కుకుంటున్నారు.
ప్లాస్టిక్ రహిత ప్రొడక్ట్
ఈ శానిటరీ న్యాప్కిన్స్ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా తయారు చేస్తున్నారు. న్యాప్కిన్స్ ప్యాడ్స్‌తో పాటు కవర్ ప్యాకింగ్ పేపర్‌తో తయారు చేస్తున్నారు. మార్కెట్లో లభిస్తున్న ఖరీదైన కార్పొరేట్ సంస్థలు తయా రు చేస్తున్న శానిటరీ న్యాప్కిన్ ప్రొడక్ట్‌లు ప్లాస్టిక్ ప్యాకింగ్‌లను వినియోగిస్తున్నారు. లోకల్ బ్రాండ్‌గా మార్కెట్లోకి వచ్చిన ‘చెలి’ న్యాప్కిన్స్ ప్యాడ్స్‌ను పూర్తిగా కాటన్‌తో రూపొందించడం ప్రత్యేకత.
అనేక ప్రత్యేకతలు
చెలి శానిటరీ న్యాప్కిన్స్లో అనేక ప్రత్యేకతలున్నాయి. పూర్తి హైజెనిక్ శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. మహిళలే స్వశక్తితో తయారు చేస్తున్న న్యాప్కిన్ ప్యాడ్స్‌లో అనేక జాగ్రత్తలు తీసుకుంటు న్నారు. వీటి తయారీలో ఉర్ఫల్ఫ్ షీట్‌ను వినియోగించడం ప్రత్యేకత. ఎలాంటి బ్యాక్టీరియా ఉండ కుండా ప్యాక్ చేసే ముందు న్యాప్కిన్స్ను గంటన్నర పాటు స్టెరిలైజేషన్ చేస్తారు.
ప్రభుత్వ సంస్థలు సహకరించాలి
సొంత పెట్టుబడితో ఉపాధి రంగంలోకి అడుగు పెట్టిన మాకు ప్రభుత్వం చేయూత అందించాలి. ప్రభుత్వం చెలి హైజెనిక్ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థినులకు వీటిని అందించేలా అవకాశం కల్పించాలి. ప్రభుత్వం చేయూత అందిస్తే మరింత ఆత్మైస్థెర్యంతో ముందుకు వెళ్తాం. ప్రభుత్వం రుణ సహాయం అందిస్తే మరికొంత మందికి ఉపాధి కల్పించి వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. భవిష్యత్‌లో 20వేల ప్యాకెట్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే రోజు ల్లో మహిళలకు న్యాప్కిన్స్ తయారీలో శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం ప్రొడక్ట్ మార్కెటింగ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. షాపింగ్ మాల్స్‌లో మార్కెటింగ్ కోసం కృషి చేస్తున్నాం. ఇందుకు కార్పొరేషన్, మెప్మా అధికారులు చేయూత అందిస్తే మార్కెటింగ్‌లో మరింత ముందుకు పోతాం.
– చింత రజిని, రుద్రమదేవి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు