స్థానిక ఫలితాలతో రేవంత్‌కు మైండ్‌బ్లాక్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలను చూసి రేవంత్‌రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయండి
- ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి నిధులు సాధించుకుందాం
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు సన్మానం
రాయపర్తి, డిసెంబర్ 21 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలను చూసి రేవంత్‌రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడు తూ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని అన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో కొలువుదీరిన రేవంత్ సర్కార్ గడిచిన రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగందని, ప్రజలు గులాబీ జెండానే విశ్వసిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఫలితాలతో రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం చేయడం లేదన్నారు. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటు లో ఉంటూ కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలన్నా రు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు నేర్పు, ఓడిన వారు ఓర్పుతో ముందుకు సాగాలని హితవు పలికారు. గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి నిధులు సాధించుకుందామని పేర్కొన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన నూతన ప్రజాప్రతినిధులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగుకుమార్, పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, జాజునాయక్, బాలరాజు, నర్మద పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

