దేవరుప్పుల, జూలై 4 : మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 70వ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా దేవరుప్పుల మండల కేంద్రంతో పాటు తొర్రూరు, పాలకుర్తిలో జరిగిన వేడుకలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ లక్షలాది మంది అభిమానులు దయన్న జన్మదిన వేడుకలు జరుపుతున్నారన్నారు.
కార్యక్రమంలో మండల నాయకులు పల్లా సుందర్‌రాంరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తీగల దయాకర్, బస్వ మల్లేశం, కొల్లూరు సోమయ్య, ఏల సుందర్, తాటిపల్లి మహేశ్, జెరిపోతుల సాయిలు, మైదం జోగేశ్వర్, వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, వీరారెడ్డి అశోక్‌రెడ్డి, చింత రవి, ధరావత్ రాంసింగ్, కోతి ప్రవీణ్, చంద్రమౌలి, హనుమంతు, నవీన్‌నాయక్, పృథ్వీరెడ్డి, కారుపోతుల భిక్షపతి, గోలి చిన ఉప్పల్‌రెడ్డి, ఖాసీం, సుడిగెల హనుమంతు, వంగ అర్జున్, జనార్దన్, జోగేశ్వర్, ఇంటి సంజీవరెడ్డి, పందెనబోయిన నవీన్, తీగల పరశురాములు, భూక్యా సుధాకర్, కుతాటి నర్సింహులు, ఇనుముల రంగయ్య, పానుగంటి గిరి, బానోత్ నవీన్, బట్ట వేణు, కారుపోతుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూలై 4న ఎర్రబెల్లి జన్మదినం కాగా అమెరికాలో ఉన్న ఆయన అక్కడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఫోన్లో ఎర్రబెల్లితో మాట్లాడి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.