నా జన్మ సార్థకం
పాలకుర్తి, వల్మిడి, బమ్మెరతో పాటు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అధిక నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పట్టుదలతో వల్మిడిలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కట్టించిన తన జన్మ సార్థకమైందన్నారు.
- సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
- వల్మిడిలో మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి
- కార్యక్రమ విజయవంతానికి కమిటీ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కలెక్టర్‌తో కలిసి సమీక్ష
- ఉత్సవ విగ్రహాలను మంత్రికి అందించిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్ దంపతులు
- ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి..
- ఏర్పాట్లను పరిశీలించిన సీపీ ఏవీ రంగనాథ్
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 2 : పాలకుర్తి, వల్మిడి, బమ్మెరతో పాటు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అధిక నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పట్టుదలతో వల్మిడిలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కట్టించిన తన జన్మ సార్థకమైందన్నారు. వల్మిడిలో ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఆయన కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పరిశీలించారు. ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆరే స్వయంగా ఏప్రిల్ 27, 2017లో బమ్మెరకు వచ్చి జనగామ జిల్లాకు రూ.40కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. పాలకుర్తికి రూ.10కోట్లు, బమ్మెరకు 7.50కోట్లు, వల్మిడికి రూ.5కోట్లు మంజూరు చేశారని, పాలకుర్తి, వల్మిడి, బమ్మెర పర్యాటక ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.100కోట్లతో పనులు చేపట్టామని వివరించారు. వల్మిడిని రూ.50కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. పాలకుర్తిలో పాల్కురికి సోమనాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణ మండపం, సోమేశ్వరాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. బమ్మెరను బాసరగా మార్చబోతున్నామని, వల్మిడిని మరో భద్రాద్రిగా తీర్చిదిద్దానని, దీంతో తన చిరకాల కోరిక నెరవేరిందన్నారు. వల్మిడిలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని ఈ నెల 4న మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, త్రిదిండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రారంభించుకోనుండడం ఆనందంగా ఉందన్నారు. 4న మధ్యాహ్నం 12గంటలకు మంత్రులు హాజరవుతారని, ఉదయం 9గంటలకు చిన జీయర్ స్వామి చేరుకుంటారని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పాలకుర్తిలో సోమనాథుడి విగ్రహాన్ని, కల్యాణ మండపాన్ని, మిషన్ భగీరథ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. పాలకుర్తిలో రూ.25కోట్లతో నిర్మించే హరిత కాకతీయ హోటల్‌కు భూమిపూజ చేస్తారని చెప్పారు. రూ.150కోట్లతో పంచాయతీ రాజ్, ఆర్అండ్ రోడ్లు, బ్రిడ్జిని ప్రారంభిస్తారని తెలిపారు.
రెండో రోజు పూజలు
ఉత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం మంగళవాయిద్యాలు, సేవా కాలం, 8గంటలకు ప్రాబోధికి అరగింపు, ఉదయం 9గంటల నుంచి స్వస్తి వాచనం, మూర్త కుంభ స్థాపన, ద్వార తోరణ, ధ్వజ కుంభాళ్యారాధనా, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, పర్యగ్నికరణం, నవకలశ స్నపనం, మధ్యాహ్నం 12.30గంటలకు నివేదన, మంగళశాసనం, తీర్థ ప్రసాదగోష్టి, సాయంత్రం 5గంటలకు మంగళవాయిద్యాలు, విష్ణు సాహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, మూల మంత్ర అధివాస హోమాలు, జలాధివాసం, క్షీరాధివాసం, రాత్రి 8:30గంటలకు నివేదన, మంగళశాసనం, తీర్థ ప్రసాదగోష్టి వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు-ఉషాదయాకర్‌రావు దంపతులు, కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ ప్రత్యేక పూజలు చేశారు. సన్నూరు దేవాలయ ప్రధాన అర్చకుడు ఆరుట్ల రంగాచార్యస్వామి పర్యవేక్షణలో అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేవరుప్పుల మండలం పెద్ద మడూరుకు చెందిన బీఆర్ఎస్ యువజన నాయకుడు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దంపతులు రూ.24లక్షలతో చేయించిన సీతారామచంద్రుల వెండి విగ్రహాలను మంత్రి ఎర్రబెల్లికి శనివారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో అందజేశారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లను వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఉత్సవాల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సమీక్షలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీపీ పీ సీతారాం, ఏసీపీ వీ సురేశ్, దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ అనిల్‌కుమార్, డీపీవో రంగాచారి, జడ్పీ సీఈవో అనిల్‌కుమార్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, కత్తి సైదులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, సిందే రామోజీ, వర్రె వెంకన్న, దేవస్థానం చైర్మన్లు వీ రాంచంద్రయ్య శర్మ, వీరమల్ల జైహింద్, ఈవో బీ లక్ష్మీ ప్రసన్న, ఎండీ మదార్, ఎర్రబెల్లి రాఘవరావు, ఎస్ఈ వేణుమాధవ్, కాంట్రాక్టర్ కే నర్సింహారెడ్డి, వివేరా వెంకట్‌రెడ్డి, డీపీఆర్వో ప్రసాద్, గోపాల్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

