ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే లక్ష్యం
రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్‌సింగ్ అన్నారు. శనివారం ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నిర్మించే నూతన కోర్టు భవనాలకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్‌సింగ్
- ములుగు, భూపాలపల్లిలో నూతన కోర్టు భవనాలకు భూమిపూజ
- వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన చీఫ్ జస్టిస్
- హాజరైన న్యాయమూర్తులు వేణుగోపాల్, రాజేశ్వర్‌రావు
ములుగు, నమస్తేతెలంగాణ/భూపాలపల్లి రూరల్, నవంబర్ 1: రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్‌సింగ్ అన్నారు. శనివారం ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నిర్మించే నూతన కోర్టు భవనాలకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు ఈవీ వేణుగోపాల్, ఎన్. రాజేశ్వర్‌రావు హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేశ్కుమార్సింగ్ మాట్లాడుతూ వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్థకు ఉందన్నారు.
కొత్త కోర్టుల ఏర్పాటు అనేది సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణే న్యాయ వ్యవస్థ ధ్యేయం కావాలన్నారు. ములుగులో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ పాల్గొన్నారు. భూపాలపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన న్యాయమూర్తులు
వెంకటాపూర్ : యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు వేణుగోపాల్, రాజేశ్వర్‌రావు సందర్శించారు. అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా రుద్రేశ్వరస్వామికి పూజలు చేశారు. అర్చుకులు ఆలయంలో వారిని సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ శిల్ప సంపదను వారికి వివరించారు. అలాగే ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయాన్ని సైతం న్యాయమూర్తులు సందర్శించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

