గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 12, 2020 , 01:01:18

అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • - జిల్లా విజిలెన్స్‌ అధికారి వినయ్‌కుమార్‌


మోమిన్‌పేట : పల్లెల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా విజిలెన్స్‌ అధికారి  వినయ్‌కుమార్‌ అన్నారు. శనివారం మ ండల పరిధిలోని మేకవనంపల్లి, మొరంగపల్లి, ఎ న్కెపల్లి తదితర గ్రామాల్లో రెండో విడుత పల్లె ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి జోరుగా సాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడుత పల్లె ప్రగతి పనులు గ్రామాల్లో మంచిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మరుగుదొ డ్లు, ఇంకుడుగుంతలు, మురుగు కాల్వలు, రోడ్లు శుభ్రంగా ఉన్నాయన్నారు. కంపోస్టు షెడ్ల నిర్మా ణం, వైంకుఠధామం, డంపింగ్‌ యార్డుల పను లు గ్రామాల్లో చాలా వరకు మెరుగు పడిందన్నా రు. అందుకు కారణమైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. కా ర్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో శంకరయ్య, సర్పంచ్‌లు, కా ర్యదర్శులు, వీఆర్వోలు, ఉపా ధిహామీ సిబ్బంది ఉన్నారు.


logo