ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను ఆదర్శంగా తీసుకోవాలి : జడ్పీటీసీ మధుకర్

మర్పల్లి, ఆగస్టు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేశారని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సోమలింగం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం, కో-ఆప్షన్ సభ్యుడు సొహెల్, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, సర్పంచ్ లు పాండు, శివకుమార్, ఈసీ విఠల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Vikarabad-two News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

