e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home బతుకమ్మ ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?

ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?

ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?

ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి? ఈశాన్యంలోనే తప్పనిసరా? – రామోజు లక్ష్మి, కీసర
గృహానికి, గుడికి వాస్తు విధానం ఒకేలా ఉండదు. ఇంటి నిర్మాణంలో ఈశాన్యంలోనే శంకుస్థాపన చేస్తారు. గుడికి వచ్చేసరికి గర్భస్థానంలో చేయాలి. మొత్తం గుడి ‘నక్ష’ ఆధారంగా చేసుకొని గర్భగుడి స్థానాన్ని నిర్దేశించాలి. గర్భగుడి కొలతలుకూడా ఆయా దేవుళ్ల నామ నక్షత్రాలనుబట్టి ‘ఆగమశాస్త్రం’ ప్రకారంగా నిర్ణయిస్తారు. దీని ఆధారంగా గర్భగుడి స్థానాన్ని పది అడుగుల లోతు తవ్వాలి. గర్భాలయం పొడవు, వెడల్పులకన్నా మూడు అడుగులు ఎక్కువ కొలతతో భూమి తవ్వి, ఆ గుంతలోకి ఈశాన్యం దిశగా దిగడానికి వీలుగా మెట్లు లేదా నిచ్చెన ఏర్పాటు చేసుకోవాలి. ముహూర్తం నాడు యాజ్ఞీకుడి సూచన మేరకు మంత్ర, యంత్రబద్ధంగా శంకుస్థాపన చేయాల్సి ఉంటుంది.

ఈశాన్యం గదికి హాలువైపు ‘ఆర్చి’ నిర్మించవచ్చా? గ్లాసు డోరు ఏర్పాటు చేయవచ్చా? ఏదీ లేకున్నా ఫర్వాలేదా? – కె.స్నేహలత, వెల్మజాల
చాలామంది ప్రధానద్వారం దాటగానే పెద్దహాలు కావాలని కోరుకుంటారు. కానీ, ఇంటిగర్భానికి, సింహద్వారానికి మధ్య తప్పకుండా ‘సెపరేషన్‌’ అవసరం. మీకు హాలు పెద్దగా ఉంటూనే వాస్తు ప్రకారం ఈశాన్యం గది చిన్నది చేయాలి. అంటే, రెండిటి మధ్య ‘ఆర్చి’ పెట్టడం మంచిది. అలా కాకుండా ఈశాన్య భాగాన్ని చిన్న గదిగా మార్చుకోవాలనుకుంటే మీరన్నట్టుగా గ్లాస్‌తో ‘పార్టిషన్‌’ చేసుకొని దానినుంచి రాకపోకల కోసం ైస్లెడింగ్‌ డోర్‌ పెట్టుకోవచ్చు. ఏదైనా ఈశాన్యాన్ని తప్పకుండా సెపరేట్‌ చేసే విధానం అవసరం. ఖాళీగా వదలొద్దు.

- Advertisement -

ఇంటి ఆవరణలో పిల్లలు ఆడుకోవడానికి ఇసుక తొట్టె నిర్మించాలని అనుకుంటున్నాం. ఆటస్థలం ఇంట్లో ఉండవచ్చా?- బత్తుల రమేశ్‌, రఘునాథపల్లి
చిన్నపిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారంటే మీ ఇంటి ప్రాంగణం విశాలంగా ఉండే ఉంటుంది. ఇంటి వెనుక ఏర్పాటు చేసుకోవాలంటే దక్షిణ-నైరుతిలో ‘జారుడు బల్ల’, ‘ఉయ్యాల’ వంటివి ఏర్పరచుకోవచ్చు. ప్రధానంగా ఒక ఇసుక గుంత (తొట్టె) కావాలనుకుంటే దానిని తూర్పు సగభాగంలో కానీ, ఉత్తరం సగభాగంలో కానీ ఏర్పాటు చేయాలి. మిగతా క్రీడావస్తువులు తూర్పు-ఆగ్నేయం కానీ, ఉత్తర-వాయవ్యంలో కానీ పెట్టుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఆటస్థలం ఉండటంలో ఏ దోషమూ లేదు.

వెంటిలేటర్లను ద్వారంపైన పెట్టాలా? కిటికీలమీద ఏర్పాటు చేసుకోవచ్చా? – ఏనుగు కృష్ణమోహన్‌, సిరిసిల్ల
చాలాకాలంగా ఇంటి నిర్మాణంలో వెంటిలేటర్లు కనిపించడం లేదు. వాటి ప్రాముఖ్యం తెలియక యజమానులూ పట్టించుకోవడం లేదు. కానీ, మనిషికి నాసిక ఎంత అవసరమో, ఇంటికి వెంటిలేటర్‌ అంత ముఖ్యం. మనం వదిలిన గాలి (కార్బన్‌ డై ఆక్సైడ్‌) తేలికగా ఉంటుంది. ఇది గది పైభాగంలోకి చేరుతుంది. అలా పైకి చేరిన గాలి వెంటిలేటర్‌ గుండా తేలికగా బయటకు వెళ్లిపోతుంది. ప్రతి గదికి ఒక వెంటిలేటర్‌ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కిటికీపైన, బీమ్‌కి కింద ఉండేలా చూసుకోవాలి. వీటికి అద్దాలు బిగించడం ద్వారా ప్రయోజనం ఉండదు. జాలీలు పెట్టుకోవచ్చు.

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?
ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?
ఆలయ శంకుస్థాపన ఏ ప్రదేశంలో జరపాలి?

ట్రెండింగ్‌

Advertisement