Mark Zuckerberg : కొత్త సంవత్సరం సందర్బంగా మెటా సీఈఓ మార్క జుకర్‌బర్గ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. మూడోసారి తండ్రి కాబోతున్న అతను భార్య ప్రిసిల్లా చాన్‌తో ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ‘కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2023లో అన్నిరకాల సాహసాలు, సంతోషం రాబోతున్నాయి’ అంటూ ఆ పోస్టుకు ఆసక్తికర క్యాప్సన్ రాశాడు. గర్భవతి అయిన ప్రిసిల్లా చాన్, జుకర్‌బర్గ్ నవ్వుతూ ఉన్న ఆ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్‌ను 4 లక్షల మందికిపైగా లైక్ చేశారు.
2003లో ఒక పార్టీలో చిన్నపిల్లల వైద్యురాలు అయిన ప్రిసిల్లాను జుకర్‌బర్గ్ కలుసుకున్నాడు. అప్పటినుంచి వీళ్ల మధ్య ప్రేమ నడుస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకూతురు మాక్సిమా చాన్ జుకర్‌బర్గ్‌కు ఏడేళ్లు. ఐదేళ్ల వయసు ఉన్న చిన్నకూతురు పేరు అగస్ట్ చాన్ జుకర్‌బర్గ్.