గుడ్న్యూస్.. ఇక ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్

న్యూఢిల్లీ: కొన్ని డ్రైవింగ్ లైసెన్స్లతోపాటు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ఆన్లైన్ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 18 రకాల సేవలను పూర్తిగా ఆన్లైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ ధృవీకరణతో ఈ సేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్, వెహికిల్ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ లాంటి వాటి కోసం ఇక రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో)లకు వెళ్లాల్సిన పనిలేదు. మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దగా ఇబ్బంది లేకుండానే ప్రజలు ఈ సేవలు పొందడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఆ 18 సేవలు ఇవే..
- లెర్నర్ లైసెన్స్
- డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్
- డ్రైవింగ్ చేసే సామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం లేని వారి డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్
- లైసెన్స్, ఆర్సీలో అడ్రెస్ మార్పు
- ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ
- మోటార్ వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్
- పూర్తిగా సిద్ధమైన మోటారు వాహనం రిజిస్ట్రేషన్
- డూప్లికేట్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
- సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోసం ఎన్వోసీ జారీ అప్లికేషన్
- లైసెన్స్ నుంచి వెహికిల్ సరెండర్
- మోటార్ వెహికిల్ ఓనర్షిప్ బదిలీ నోటీసు
- మోటార్ వెహికిల్ ఓనర్షిప్ బదిలీ అప్లికేషన్
- ఆర్సీలో అడ్రెస్ మార్పు సమాచారం
- అక్రెడిటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి శిక్షణ పొందుతున్న డ్రైవర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్
- దౌత్య అధికారి మోటార్ వాహనం రిజిస్ట్రేషన్ అప్లికేషన్
- దౌత్యాధికారి మోటార్ వాహనానికి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మార్క్
- హైర్-పర్చేజ్ అగ్రీమెంట్ ఎండార్స్మెంట్
18.హైర్-పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

