Mauna Loa Volcano : ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతమైన మౌనా లోవా బద్ధలైంది. హవాయు దీవుల్లో ఉన్న ఈ అగ్నిపర్వతం లోంచి ఆదివారం రాత్రి నుంచి ఎరుపు రంగులో లావా బయటకు ఎగసిపడుతోంది. ‘ప్రస్తుతం అగ్నిపర్వతం ఉన్న భాగం వరకే లావా పొంగుకొని వస్తోంది. ఇప్పటివరకైతే దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు దీనివల్ల ఏం ప్రమాదం లేదు’ అని అమెరికా జియోలాజికల్ వోల్కనిక్ యాక్టివిటీ సర్వీసెస్ (యూఎస్జీఎస్) వెల్లడించింది. అయితే.. లావా ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అంతేకాదు సాధ్యమైనంత తొందరగా హవాయి వొల్కనో అబ్జర్వేటరీ (హెచ్వీఓ) సంస్థ ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నట్టు సమాచారం. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా తీవ్రత, దాని పరిణామాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ సర్వే చేయనుంది. మౌనా లోవా అనేది ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాల్లోకెల్లా పెద్దది. ఈ అగ్నిపర్వతం ఫసిఫిక్ మహాసముద్ర మట్టానికి 13,796 అడుగుల ఎత్తులో ఉంది.