నగరజీవుల నోట్లో నిత్యం నానేది పిజ్జా..ఆకలేస్తే చాలు పిజ్జా తినేందుకు అంతా ట్రైచేస్తారు. పిజ్ఞా టాపింగ్ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో చాయిస్. కొందరు పెప్పొరినీ ఇష్టపడితే, మరికొందరు మష్రూమ్స్, ఆనియన్స్ సాసేజ్, బేకన్, ఎక్ట్స్రా చీజ్, బ్లాక్ ఆలివ్, గ్రీన్ పెప్పర్స్ టాపింగ్స్ ఇష్టపడుతారు. మరి టాపింగ్ లేకుండా పిజ్ఞాను మీరు ఊహించగలరా? ఇలాంటి వెరైటీ ఆర్డర్ అందుకుంది ఓ డోమినోస్ వర్కర్..
ఓ కస్టమర్నుంచి వచ్చిన పిజ్జా ఆర్డర్ చూసి డోమినోస్ వర్కర్ ఆశ్చర్యపోయింది. జీరో టాపింగ్ పిజ్ఞా (టాపింగ్లేకుండా పిజ్జా) కావాలని ఓ వ్యక్తి ఆర్డర్ చేశాడు. ఈ ఆర్డర్ అందుకున్న డోమినోస్ వర్కర్ పిజ్ఞా ప్యాక్ చేస్తూ నవ్వుకున్నది. ఇలాంటి ఆర్డర్ తన జన్మలో చూడలేదంటూ నవ్వాపుకోలేకపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.