రైల్వే పోలీసు అప్రమత్తతో ఓ యువకుడి ప్రాణం దక్కింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. బోగీలోకి ఎక్కబోతూ ఓ యువకుడు పడిపోగా, రైలుతోపాటే ప్లాట్‌ఫాంపై కొంతదూరం వెళ్లిపోయాడు. ఆ యువకుడిని గమనించిన ఆర్పీఎఫ్ పోలీసు చాకచాక్యంగా వెనక్కు లాగాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ర్వైల్వే స్టేషన్లో జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. పట్టుతప్పడంతో ప్లాట్‌ఫారమ్‌కు, రైలుకు మధ్య ఉన్న గ్యాప్‌లోకి జారిపోయాడు. కిందపడిపోయి రైలుతోపాటే ప్లాట్‌ఫాంపై వెళ్తున్న యువకుడిని చూసిన రైల్వే పోలీసు కానిస్టేబుల్ రఘువీర్‌సింగ్ పరుగెత్తికెళ్లి ఆ యువకుడిని రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఆన్లైన్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.