వ్యక్తి మెడకు చుట్టుకున్న పాము… దానిపై కాల్పులు జరిపి అతడ్ని రక్షించిన పోలీసులు
వాషింగ్టన్: ఒక వ్యక్తి మెడకు పొడవైన పాము చుట్టుకుంది. దీంతో ఊపిరి ఆడక అతడు అల్లాడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాముపై గన్‌తో కాల్పులు జరిపారు. దాని బారి నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. హాలీవుడ్ హర్రర్ సినిమాను తలపించేలా ఉన్న ఈ సంఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి పాములను సేకరిస్తుంటాడు. అతడి ఇంట్లో చాలా రకాల పాములు ఎన్క్లోజర్లలో ఉన్నాయి. బుధవారం 15 అడుగుల పొడవైన, బలమైన పాము అతడి మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరి ఆడకపోవడంతోపాటు గుండెపోటు రావడంతో అపస్మారకంగా కింద పడిపోయాడు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతడి మెడ చుట్టూ పెద్ద పాము చుట్టుకుని ఉండటంతో ఏం చేయాలో వారికి తోచలేదు. ఎలాగైనా అతడ్ని పాము బారి నుంచి కాపాడాలని నిర్ణయించారు. ఆ వ్యక్తికి దూరంగా ఉన్న పాము తలపై గన్‌తో కాల్పులు జరిపారు. గాయపడిన పాము ఆ వ్యక్తి మెడను విడిచిపెట్టింది. దీంతో అతడ్ని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు తన 19 ఏళ్ల సర్వీసులో ఇలాంటి భయానక సంఘటన ఎప్పుడూ చూడలేదని ఆ వ్యక్తిని కాపాడిన ఒక పోలీస్ అధికారి తెలిపాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన తమకు హర్రర్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించిందని చెప్పాడు. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావించి అతడి మెడకు చుట్టుకున్న పొడవైన, బలమైన పాము తలపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు వివరించాడు. అయితే ఆ పాము వెంటనే చనిపోలేదని, అది ఏ జాతి పామో కూడా తమకు తెలియదన్నాడు. స్నేక్ లవర్ అయిన ఆ వ్యక్తి ఇంట్లోని ఎన్క్లోజర్లలో పలు రకాలు పాములున్నాయని వెల్లడించాడు.
కాగా, ఈ రెస్క్యూలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అధికారి కూడా అభినందించారు. సమయస్ఫూర్తిగా వారు వ్యవహరించారని తెలిపారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

