Monster fish | అమెరికా జాలరి వలకు చిక్కిన ‘పేద్ద’ చేప
అమెరికాకు చెందిన ఓ జాలరి వలకు ‘పేద్ద’ చేప చిక్కింది. ఈ చేప కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు దాన్ని చూసి స్టన్నవుతున్నారు. అమెరికా జాలరీకి దొరికిన ‘పేద్ద’ చేప వార్త ఫేస్బుక్లో కనెక్టికట్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ వేదిక ద్వారా...
సాధారణంగా మన మత్స్యకారులకు 5, 10 కిలోల బరువుండే చేపలు దొరుకుతుంటాయి. ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం బాగుండి ఇంకా ఎక్కువ బరువుండే చేపలు వారి వలకు చిక్కుతుంటాయి. అయితే, అమెరికాకు చెందిన ఓ జాలరి వలకు ‘పేద్ద’ చేప చిక్కింది. ఈ చేప కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు దాన్ని చూసి స్టన్నవుతున్నారు.
అమెరికా జాలరీకి దొరికిన ‘పేద్ద’ చేప వార్త ఫేస్బుక్లో కనెక్టికట్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ వేదిక ద్వారా వైరల్‌గా మారింది. జాలరి తన చేతులతో పట్టుకున్న చేప ఫొటోను కూడా జత చేశారు. ‘వేసవిలో చేపల వేట ఎలా కొనసాగుతుంది’ అనే కాప్షన్‌ను ఇచ్చారు. ఈ టైగర్ మస్కీ అనే పేరుగల పేద్ద చేపను షేర్ చేసిన జాలరీ జో రివాస్‌కు ధన్యవాదాలు అంటూ ఫొటో కింద రాశారు.
ఈ టైగర్ మస్కీ అనే చేప.. ఉత్తర పైక్-మస్కెలుంజ్ క్రాస్ బ్రీడ్‌గా నెటిజెన్లు భావిస్తున్నారు. ఈ చేప దాదాపు 42 అంగుళాల పొడవు ఉన్నది. ప్రౌఢ దశలో ఈ చేపలు దాదాపు 30 పౌండ్ల వరకు బరువు తూగుతాయంట. ఇలాంటి క్రాస్ బ్రీడ్ చేపలు చాలా అరుదుగా ఉంటాయని వాషింగ్టన్‌లోని ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ విభాగం అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

