TikTok star : టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయిన మేఘా ఠాకూర్ గుండెపోటుతో మృతి చెందింది. టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయిన మేఘా ఠాకూర్ గుండెపోటుతో మృతి చెందింది. ఆమె నవంబర్ 24వ తేదీన చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కెనడాలో ఉంటున్న ఆమె 21 ఏళ్ల వయసులోనే చనిపోవడంతో కుటుంబసభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ‘భారమైన మనసుతో ఈ విషయం వెల్లడిస్తున్నాం. నవంబర్ 24వ తేదీన మా జీవితాల్లోని వెలుగు అకస్మాత్తుగా, అనుకోకుండా ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. అంటూ మేఘా తల్లిదండ్రులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కష్టసమయంలో తనకు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం. మీ ప్రార్థనలు ఆమెకు తోడుగా ఉంటాయి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. అయితే, ఆమె మరణానికి కారణం ఏంటనేది మాత్రం ఇంట్లోవాళ్లు వెల్లడిచలేదు.
మేఘాకు 4 నెలల క్రితం గుండెపోటు వచ్చింది. దాంతో, ఆమెకు ఏమైనా అవుతుందేమోనని అందరూ కంగారు పడ్డారు. ఆ సమయంలో మేఘా ఒక వీడియో పోస్ట్ పెట్టింది. ‘నాకు యాంగ్జైటీ ఎక్కువ. దానివల్ల ఒత్తిడి ఎక్కువైంది. ఫలితంగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాను’ అంటూ మేఘా వీడియోలో చెప్పింది. మేఘా టిక్‌టాక్‌లో బాడీ పాజిటివిటీ గురించి అవేర్నెస్ కల్పిస్తూ పోస్టులు పెట్టేది. తన డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుండేది. తన వీడియోల్లో పాపులర్ సెలబ్రిటీలు జైలీ కెన్నర్, బెల్లా హడిడ్ గురించి చెప్పేది.
మేఘాకు టిక్‌టాక్‌లో 9.3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో లక్ష మంది ఆమెను ఫాలో అవుతున్నారు. మేఘాకు ఏడాది వయసు ఉన్నప్పుడే ఫ్యామిలీ అంతా కెనడాకు వలస వెళ్లింది. అక్కడి వెస్టర్న్ యూనివర్సిటీలో చదువుతున్న టైంలోనే టిక్‌టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది.