e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News 'గ్వాలియ‌ర్‌లో ఛాట్ అమ్ముకుంటున్న‌ ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌'.. వీడియో వైర‌ల్‌

‘గ్వాలియ‌ర్‌లో ఛాట్ అమ్ముకుంటున్న‌ ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌’.. వీడియో వైర‌ల్‌


గ్వాలియ‌ర్: ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ గ్వాలియ‌ర్‌లో ఛాట్ అమ్ముకుంటున్నారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి ఏమిటి..? ఛాట్ అమ్ముకోవ‌డం ఏమిటి..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? కానీ ఇది పూర్తిగా అబ‌ద్దం కాదు, అలాగ‌ని పూర్తిగా నిజం కాదు. ఇందులో అర్ధ‌స‌త్యం ఉన్న‌ది. నేరుగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కాక‌పోయినా అచ్చం కేజ్రివాల్‌ను పోలిన ఓ వ్య‌క్తి గ్వాలియ‌ర్‌లో ఓ మోపెడ్‌పై తిరుగుతూ ఛాట్ అమ్ముతున్నాడు. ఈ డూప్లికేట్ కేజ్రివాల్ నిర్వ‌హిస్తున్న గుప్తా ఛాట్ దుకాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఫుడ్ బ్లాగ‌ర్ క‌ర‌న్ దువాకు సంబంధించిన‌ దిల్ సే ఫుడీ హ్యాండిల్ ద్వారా గుప్తా ఛాట్ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 2,14,821 మంది వీక్షించారు. 9,400 మంది లైక్ చేశారు. వంద‌ల మంది నుంచి కామెంట్ల వ‌ర్షం కురుస్తున్న‌ది. మోతీమ‌హ‌ల్‌లోని పూల్‌బాగ్ ఏరియాలో ప్ర‌తిరోజు ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఛాట్ స్టాల్ తెరిచి ఉంటుంది. గుప్తా ఛాట్ స్టాల్‌లో పాప‌డ్ ఛాట్‌, పాల‌క్ ప‌ట్టా ఛాట్‌, ద‌హీ వ‌డా, స‌మోసా, క‌చోరీ ల‌భిస్తాయి.

- Advertisement -

ఛాట్ స్టాల్ య‌జ‌మాని అచ్చం కేజ్రివాల్‌ను పోలి ఉండ‌టంతో వీడియో త‌క్కువ కాలంలోనే ఎక్కువ వైర‌ల్‌గా మారింది. మీరు కూడా ఈ కింది వీడియోలో డూప్లికేట్ కేజ్రివాల్‌ను ఒక‌సారి వీక్షించండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement