దేశవ్యాప్తంగా హోలీ పండుగను అంతా సంబురంగా జరుపుకున్నారు. చాలామంది సెలబ్రిటీలు వాళ్ల ఫ్యాన్స్‌కు సోషల్‌మీడియా వేదికగా వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా దేశప్రజలకు హోలీ విషెస్ చెప్పారు.
స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రాంలో అందమైన యానిమేటెడ్ వీడియో ఉంచి, హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోలో రాజస్తాన్ సంప్రదాయంలో హోలీ వేడుకలు ఎలా జరుపుకుంటారో యానిమేషన్లో చూయించారు. కొందరు పూజారులు పూజ చేస్తుండగా, మరికొందరు వాయిద్యపరికరాలను వాయిస్తూ ఉంటారు. ఈ వీడియో చూసినవారంతా ఫిదా అయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.