గ్యాంగ్ రేప్ వల్ల గర్భం దాల్చిన బాలిక… డీఎన్ఏ టెస్ట్ ద్వారా తండ్రిని కనుగొన్న కుమారుడు
లక్నో: ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె ఒక బాబును ప్రసవించింది. బాలిక తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చేశారు. ఆమెకు వెంటనే పెళ్లి చేశారు. పదేళ్ల తర్వాత గ్యాంగ్ రేప్ సంగతి తెలిసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు తన తల్లి గురించి తెలుసుకున్న కుమారుడు అసలైన తండ్రి కోసం కోర్టును ఆశ్రయించాడు. దీంతో గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒక వ్యక్తి అతడి తండ్రిగా డీఎన్ఏ టెస్ట్‌లో తేలింది. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
1994లో షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక తన అక్కాబావ ఇంట్లో నివసించింది. ఒక రోజున ఆ ఇంట్లోకి చొరబడిన స్థానికులైన కొందరు యువకులు ఒంటరిగా ఉన్న ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 13 ఏళ్ల వయసులో ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చారు. ఆ కుటుంబం రాంపూర్‌కు వలసపోయింది.
కాగా, ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెకు ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే పదేళ్ల కాపురం తర్వాత భార్యపై గతంలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు భర్తకు తెలిసింది. దీంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు పెద్దవాడైన ఆ మహిళ కుమారుడు ఆమెను కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరని అడిగాడు. జరిగిన సంగతి ఆ తల్లి చెప్పింది.
దీంతో తన తండ్రి ఎవరన్నది అతడు తెలుసుకోవాలనుకున్నాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరుపడంతో గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు గుర్తించారు. వారికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకరైన గుడ్డు 27 ఏళ్ల వ్యక్తి తండ్రిగా తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

