Ice Flowers | చైనా నదిలో విచ్చుకున్న మంచు పూలు.. వావ్.. అద్భుతం అంటున్న నెటిజన్లు
సోంఘ్వువా నదిలో విరబూసిన మంచు పూలు
Ice Flowers : శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి మంచు కురవడం, నదులు గడ్డకట్టడం మామూలే. చైనాలోని ఈశాన్య ప్రాంతలో ఉన్న సోంఘ్వువా అనే నదిలో కూడా నీళ్లు గడ్డ కట్టాయి. నది పైభాగం అంతా మంచు పరుచుకుంది. అందులో విశేషం ఏముంది అంటారా..? నది పైభాగంలో మంచు ముక్కలు అచ్చం పూల మాదిరిగా విచ్చుకున్నట్టు ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సూర్యకిరణాలు పడినప్పుడు ఆ మంచు పుష్పాలు మిరుమిట్లు గొలుపుతూ కనువిందు చేస్తున్నాయి. నార్వేకు చెందిన మాజీ దౌత్యాధికారి ఎరిక్ సొల్హీమ్ శుక్రవారం ట్విట్టర్లో ఈ ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఐస్ ఫ్లవర్స్ అద్భుతం అంటూ అతను ఆ ఫోటోలకు క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఐస్ ఫ్లవర్స్ ఏర్పడడం అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని చైనాకు చెందిన పీపుల్స్ డెయిలీ వార్తా సంస్థ తెలిపింది. శీతాకాలం మొదట్లో ఉదయం పూట ఈ పూలు ఏర్పడతాయని చెప్పింది. ముత్యాల లాగ మెరిసిపోతున్న ఈ మంచు పూలను చూసి సోషల్‌మీడియా యూజర్లు ఫిదా అవుతున్నారు.
Wonderful! ❤️
Ice flowers on Songhua River in northeast China 🇨🇳. pic.twitter.com/9x6z6zlDEi
— Erik Solheim (@ErikSolheim) December 30, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

