Viral video: జిరాఫీ పిల్లపై సింహం దాడి… తల్లి జిరాఫీ ఎలా కాపాడిందంటే!
కొంత దూరంలో ఉన్న తల్లి జిరాఫీ, పిల్ల అరుపులు విని అది ప్రమాదంలో ఉన్న సంగతి గ్రహించింది. వెంటనే ఆ జిరాఫీ పరుగెత్తుకుని పిల్ల వద్దకు వచ్చింది.
ఒక జిరాఫీ పిల్లపై సింహం దాడి చేసి వేటాడబోయింది. పిల్ల కేకలకు తల్లి జిరాఫీ పరుగెత్తుకుని వచ్చింది. దీంతో ఆ సింహం భయపడి అక్కడి నుంచి పారిపోయింది. సాధారణంగా పొడవైన మెడ కలిగి ఉండే పెద్ద జిరాఫీని సింహం ఒంటరిగా వేటాడలేదు. అయితే సింహాల గుంపు మాత్రమే పెద్ద జిరాఫీలను వేటాడతాయి. కాగా, ఒంటరి సింహాలు మాత్రం చిన్న జిరాఫీలు, ముసలి, అనారోగ్యంతో ఉన్న జిరాఫీలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఒక ఒంటరి ఆడ సింహం ఇలాంటి ప్రయత్నం చేసింది. తల్లి జిరాఫీ నుంచి దూరంగా ఉన్న పిల్ల జిరాఫీపై అది దాడి చేసింది. దాని మెడను కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. దీంతో పిల్ల జిరాఫీ విలవిలలాడుతూ బాధతో అరిచింది.
కాగా, కొంత దూరంలో ఉన్న తల్లి జిరాఫీ, పిల్ల అరుపులు విని అది ప్రమాదంలో ఉన్న సంగతి గ్రహించింది. వెంటనే ఆ జిరాఫీ పరుగెత్తుకుని పిల్ల వద్దకు వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఉన్న తల్లి జిరాఫీని చూసి సింహం భయపడింది. జిరాఫీ పిల్లను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది. ‘యానిమల్స్ పవర్స్’ అనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- baby
- Lioness
- Mother Giraffe
- Saves
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

