ఈ వర్కౌట్‌కు పరికరాలేమీ అవసరం లేదు.. ఒక్క చెట్టుంటే చాలు..మిలింద్ సోమన్ వీడియో వైరల్
యాక్టర్, మోడల్ అయిన మిలింద్ సోమన్ పేరు ఇండియాలో తెలియనివారు లేరు. 56 ఏళ్ల వయస్సులోనూ ఫిట్నెస్ ఐకాన్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఎప్పుడూ రన్నింగ్, జాగింగ్, యోగా చేస్తూ ఫిట్‌గా ఉంటాడు. ఆయన వీడియోలు యువతలో ప్రేరణ నింపుతుంటాయి. నాలుగు గోడల మధ్య జిమ్‌లో వర్కౌట్స్ చేయకుండా..ప్రకృతిలో వివిధ వ్యాయామాలు చేయడం మిలింద్ సోమన్ ప్రత్యేకత.
యాక్టర్, మోడల్ అయిన మిలింద్ సోమన్ పేరు ఇండియాలో తెలియనివారు లేరు. 56 ఏళ్ల వయస్సులోనూ ఫిట్నెస్ ఐకాన్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఎప్పుడూ రన్నింగ్, జాగింగ్, యోగా చేస్తూ ఫిట్‌గా ఉంటాడు. ఆయన వీడియోలు యువతలో ప్రేరణ నింపుతుంటాయి. నాలుగు గోడల మధ్య జిమ్‌లో వర్కౌట్స్ చేయకుండా..ప్రకృతిలో వివిధ వ్యాయామాలు చేయడం మిలింద్ సోమన్ ప్రత్యేకత. ఆయన ఇన్‌స్టాలో పెట్టే వర్కౌట్స్ వీడియోలకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా, ఇటీవల మిలింద్ సోమన్ పెట్టిన పుల్ అప్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పుల్ అప్స్ సాధారణంగా అందరూ జిమ్‌లో చేస్తుంటారు. కానీ, మిలింద్ సోమన్ ఎలాంటి పరికరాలు లేకుండా ప్రకృతిలో పుల్ అప్స్ ఎలా చేయాలో చేసి చూపించాడు. ప్రస్తుతం గోవాలో ఉన్న మిలింద్.. ఓ పార్క్‌లో చెట్టు కొమ్మ పట్టుకుని పుల్ అప్స్ వర్కౌట్ చేసి, ఆకట్టుకున్నాడు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 73వేల వ్యూస్, 8,242 లైక్స్ వచ్చాయి.
పుల్ అప్స్ వల్ల కలిగే ప్రయోజనాలివే..
పుల్-అప్స్ అనేది చేతులు, భుజాలు, ఎగువ శరీర బలంపై ఆధారపడే తీవ్రమైన వ్యాయామం. ఒక రాడ్ లేదా దృఢమైన నిర్మాణాన్ని రెండు చేతులతో పట్టుకొని మొత్తం శరీరాన్ని పైకి, కిందికి కదిలించడమే పుల్ అప్స్. పుల్ అప్స్ రోజూ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
1.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2. అప్పర్ బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది.
3. చేతులు, భుజాలు బలంగా తయారవుతాయి.
4. శరీరంపై మెరుగైన పట్టు సాధించొచ్చు.
5. అధిక బరువు తగ్గించుకోవచ్చు
6. ఎముకల సాంద్రత పెరుగుతుంది.
7. రక్తపోటును తగ్గిస్తుంది.
8. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.
9. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
10.మానసిక స్థితిని మెరుగుపడుతుంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

