Mark Zuckerberg | 2వేల ఏండ్ల చెట్టు ముందు కూతురితో జుకర్‌బర్గ్.. అద్భుతం అంటున్న నెటిజన్లు
Mark Zuckerberg : మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) ఆన్లైన్లో ఎంతో చురుకుగా ఉంటాడని తెలిసిందే. తన జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్ని అభిమానులతో పంచుకునే అతను.. తాజాగా తన కూతురితో కలిసి రోడ్ ట్రిప్ వెళ్లిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పెద్ద కూతురుతో కలిసి ప్రకృతి ఒడిలో...
Mark Zuckerberg : మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) ఆన్లైన్లో ఎంతో చురుకుగా ఉంటాడని తెలిసిందే. తన జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్ని అభిమానులతో పంచుకునే అతను.. తాజాగా తన కూతురితో కలిసి రోడ్ ట్రిప్ వెళ్లిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పెద్ద కూతురుతో కలిసి ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నాడు. ‘ఈ వీకెండ్లో తండ్రీ కూతురు రోడ్ ట్రిప్ లో భాగంగా అత్యంత పెద్దదైన సెక్వియోస్(sequoias) చెట్టును చూసేందుకు వెళ్లాం. 2 వేల ఏండ్ల నాటి ఈ చెట్టు నిజంగా ఒక అద్భుతం’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఒక ఫొటోలో కొనిఫెరస్ జాతికి చెందిన ప్రపంచంలోనే ఎత్తైన, 2వేల ఏండ్ల నాటి ఒక పెద్ద చెట్టును తన కూతురితో కలిసి జుకర్‌బర్గ్ ఆసక్తిగా గమనిస్తున్నాడు. మరో ఫొటోలో ఒక ఎత్తైన చెట్టు ముందు తండ్రీ కూతుళ్లు నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఆ ఫొటోలు చూసిన చాలామంది అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జుకర్‌బర్గ్ ఈ మధ్యే మూడోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య ప్రిసిల్లా చాను మార్చి నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు అరేలియా చాను జుకర్‌బర్గ్ అని పేరు పెట్టారు. అప్పటికే ఈ దంపతులుకు మాగ్జిమా మ్యాక్స్ (ఏడేండ్లు), ఆగస్ట్ (5 ఏండ్లు) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

