టాయిలెట్లో వీడియోగేమ్ ఆడుతున్న వ్యక్తి… పిర్రను కరిచిన పాము
కౌలాలంపూర్: టాయిలెట్లో కూర్చొని వీడియోగేమ్ ఆడుతున్న వ్యక్తి పిర్రను పాము కరిచింది. అయితే అది విష పూరిత పాము కాకపోవడంతో అతడు బతికిపోయాడు. ఈ షాకింగ్ సంఘటన మలేషియాలో జరిగింది. సెలయంట్కు చెందిన 28 ఏళ్ల సబ్రి తజలికి టాయిలెట్లో వీడియో గేమ్ ఆడే అలవాటు ఉంది. ఒక రోజు అలాగే టాయిలెట్ సీటుపై కూర్చొని వీడియో గేమ్ ఆడటంలో నిమగ్నమయ్యాడు. అయితే ఆ టాయిలెట్ బేసిన్లో ఉన్న పాము అతడి పిర్రను గట్టిగా కరిచి పట్టుకుంది. దీంతో పైకి లేచిన అతడు దానిని లాగి పడేసి భయంతో అక్కడి నుంచి ఇంట్లోకి పరుగుతీశాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరిశీలించారు. అది విషపూరిత పాము కాదని చెప్పారు. అయినప్పటికీ యాంటీ టెటానస్ ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేశారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పాము సంరక్షకులు ఆ ఇంటి బాత్ రూమ్లో దాగిన పామును సరక్షితంగా పట్టుకున్నారు. అయితే తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సబ్రి తన ట్విట్టర్లో పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని తెలిపాడు. ఈ ఘటన తర్వాత రెండు వారాల వరకు తన టాయిలెట్ రూమ్కు వెళ్లలేదని చెప్పాడు. తనను కరచిన పాము విష పూరితం కాకపోవడంతో తాను ప్రాణాలతో బతికి ఉన్నానని అన్నాడు. పాము పంటి గాట్లు రెండు వారాల వరకు పిర్రపై ఉన్నాయని, అది అంత గట్టిగా కరిచిందని పేర్కొన్నాడు.
Dua bulan lepas bontot aku kena gigit dengan ular time aku berak. Ular tu keluar dari lubang jamban. Nasib dia tak gigit telur aku. pic.twitter.com/ABDjDkSe2Q
— Abu Maleeq (@sabritazali) May 22, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

