Viral Video | ఒకే కోన్‌పై 125 ఐస్ స్కూప్స్..!
Viral Video| సాధారణంగా ఒక కోన్‌పై ఒకటి లేదా రెండు ఐస్ స్కూప్‌లు పెట్టడం చూశాం. అంతకు మించి పెట్టడం అంటే దాదాపుగా అసాధ్యమనే చెప్తారు ఎవరైనా. కానీ ఓ వ్యక్తి ఒకే కోన్‌పై ఏకంగా 125 ఐస్ స్కూప్‌లను పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇదేంటి, ఒక కోన్‌పై ఇన్ని ఐస్ స్కూప్‌లు పెట్టడం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి ఒకే కోన్‌పై ఏకంగా 125 ఐస్ స్కూప్‌లను ఉంచి రికార్డు సృష్టించారు.
Viral Video | సాధారణంగా ఒక కోన్‌పై ఒకటి లేదా రెండు ఐస్ స్కూప్‌లు పెట్టడం చూశాం. అంతకు మించి పెట్టడం అంటే దాదాపుగా అసాధ్యమనే చెప్తారు ఎవరైనా. కానీ ఓ వ్యక్తి ఒకే కోన్‌పై ఏకంగా 125 ఐస్ స్కూప్‌లను పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇదేంటి, ఒక కోన్‌పై ఇన్ని ఐస్ స్కూప్‌లు పెట్టడం ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి ఒకే కోన్‌పై ఏకంగా 125 ఐస్ స్కూప్‌లను ఉంచి రికార్డు సృష్టించారు.
ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియేరా.. ఒక కోన్‌పై 125 రంగురంగుల ఐస్ స్కూప్‌లను ఒకదానిపై మరొకటి అమర్చి రికార్డు సృష్టించారు. గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా సంపాదించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్వరల్డ్ రికార్డు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. కాగా, దిమిత్రీ.. గతంలో ఒకే కోన్‌పై 121 ఐస్ స్కూప్‌లను ఉంచి అప్పట్లో రికార్డు సృష్టించాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టినట్లైంది.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘ఐస్ క్రీం అంటే ఆ మాత్రం సైజు ఉండాలి మరి’, ‘ఈ రికార్డును ఇంక బ్రేక్ చేసేదెవరో.. దీన్ని తినేదెవరు..?’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దిమిత్రీ.. కోన్‌పై 125 ఐస్ స్కూప్‌లను అమర్చిన విధానాన్ని మీరూ చూసేయండి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

