Viral Video | భూమిపై ఉన్న అన్ని జంతువుల్లోకెళ్లా ఏనుగులు చాలా పెద్దవని చెప్పొచ్చు. అయితే, ఇతర జంతువులతో పోలిస్తే గజరాజులు ఎంతో ప్రేమ, స్నేహ భావంతో మెలుగుతాయి. వీటికి భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఇదేసమయంలో మనుషుల్లాగా సరదాగా గడిపేందుకు ఇష్టపడుతుంటాయి. తాజాగా రెండు ఏనుగులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చిందులేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
థాయ్‌లాండ్‌లోని ఓ ఫారెస్ట్ ఏరియాలో ఓ తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేశాయి. ప్రముఖ పియోనిస్టు పౌల్ బార్టన్ పియానో వాయిస్తుండగా.. మ్యూజిక్కు అనుగునంగా ఏనుగులు ఎంతో ఉత్సాహంగా చిందులేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Piano for mother and baby elephant ❤️ video – Paul Barton Thailand pic.twitter.com/jCqrlJ7ytk
— Supriya Sahu IAS (@supriyasahuias) November 20, 2022