Love Marriage | మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా? అయితే హైదరాబాదీ అమ్మలకు ఓకేనట..!
Love Marriage | లవ్ మ్యారేజెస్ ( Love Marriage ) అంటేనే నెగిటివ్ ఫీలింగ్.. ప్రేమ పెళ్లి అనే ప్రస్తావన తెచ్చామంటే చాలు.. తల్లిదండ్రుల్లో ఆగ్రహాజ్వాలలు రగిలిపోయేవి. ప్రేమాయణంలో మునిగి తేలే తమ పిల్లలను కట్టడి చేసేందుకు

హైదరాబాద్ : లవ్ మ్యారేజెస్ ( Love Marriage ) అంటేనే నెగిటివ్ ఫీలింగ్.. ప్రేమ పెళ్లి అనే ప్రస్తావన తెచ్చామంటే చాలు.. తల్లిదండ్రుల్లో ఆగ్రహాజ్వాలలు రగిలిపోయేవి. ప్రేమాయణంలో మునిగి తేలే తమ పిల్లలను కట్టడి చేసేందుకు ఎంతటికైనా తెగించేవారు. అవసరమైతే అంతమొందించే వారు కూడా. ఒకప్పుడు ఇలాంటి ఘటనలు కోకోల్లలు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా.. తల్లిదండ్రుల్లో సైతం మార్పు వస్తోంది. తమ పిల్లల ప్రేమ వివాహాలకు ఓకే చెప్పేస్తున్నారు. అయితే ఈ లవ్ మ్యారేజేస్కు తల్లులే అధికంగా మద్దతు తెలుపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.
ట్రూలీ మ్యాడ్లీ( TrulyMadly ) అనే డేటింగ్ యాప్ ( Dating app ) ప్రేమ వివాహాలపై దేశ వ్యాప్తంగా ఆన్లైన్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అధికంగా తల్లులు పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ అమ్మల విషయానికి వస్తే.. 84 శాతం మంది తల్లులు తమ పిల్లల ప్రేమ వివాహాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా చూస్తే 50 శాతం మంది తల్లులు మాత్రమే ప్రేమ వివాహాలను అంగీకరిస్తున్నారు. ఇక డేటింగ్ యాప్‌ల్లో తమకు నచ్చిన అబ్బాయిని వెతుక్కోవడంలో తప్పు లేదని తల్లులు అంటున్నారట. అలాగే, హైదరాబాద్‌తో సహా దక్షిణ ప్రాంతానికి చెందిన 37 శాతం మంది తల్లులు తమ పిల్లలు డేటింగ్ యాప్‌లలో భాగస్వాములను కనుగొనడాన్ని ఎక్కువగా అంగీకరిస్తున్నట్లు సర్వేలో తేలింది.
ఈ సందర్భంగా ట్రూలీ మ్యాడ్లీ సీఈవో, కో ఫౌండర్ స్నేహిల్ ఖనూర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా డేటింగ్‌పై ఉన్న అనుమానాలు, భయాలను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించామన్నారు. యువతరంతో పాటు వారి పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మార్పు చెందారు. డేటింగ్ యాప్‌లలో తమ భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదని తల్లులు అంగీకరిస్తున్నారు. లింగ వివక్షను తగ్గించడానికి ఇది గొప్ప పరిణామం అన్నారు. ఈ పరిణామం మహిళల హక్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నానని స్నేహిల్ పేర్కొన్నారు. ఈ సర్వేలో దేశ వ్యాప్తంగా 5,000 మంది యువతీయువకులు పాల్గొన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
‘రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి’
Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

