Viral Video: వేటాడేందుకు ఏనుగుపైకెక్కిన సింహం… తర్వాత ఏం జరిగిందంటే?
న్యూఢిల్లీ: ఏనుగును వేటాడేందుకు ఒక ఆడ సింహం తెగ ప్రయత్నించింది. దాని చెవిని నోటితో పట్టుకుని కొంతసేపు వేలాడింది. అనంతరం ఏనుగుపైకి ఎక్కి దాడికి యత్నించింది. దీంతో ఆ ఏనుగు బాధతో విలవిలలాడింది. అయితే ఏనుగు ఒక్కసారిగా బలంగా విదిలించడంతో సింహం పట్టు తప్పింది. ఇలా ఆడ సింహం దాడిని చిన్న ఏనుగు ఎదుర్కొంది. సఫారీకి వెళ్లిన ఒక వైల్డ్ ఫొటోగ్రాఫర్‌కు సింహం, ఏనుగు పోట్లాట కంటపడింది. దీంతో తన వాహనం నుంచి దీనిని వీడియో తీశారు. లైఫ్ అండ్ నేచర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మానవుల తర్వాత ఏనుగుకు హాని కలిగించేవి సింహాలు మాత్రమే. సాధారణంగా సింహాలు గుంపుగా మాత్రమే ఏనుగును వేటాడతాయి. ఎక్కువగా ఆడ సింహాలే వేటాడినప్పటికీ, మగ సింహాలు వాటి కంటే 50 శాతం ఎక్కువ బరువుతో బలిష్ఠంగా ఉంటాయి. దీంతో ఆరేడు ఆడ సింహాలు వేటాడి ఏనుగును సంహరిస్తే, కేవలం రెండు మగ సింహాలు దీనిని సాధిస్తాయి. చిన్న ఏనుగును ఒక్క మగ సింహం కూడా వేటాడగలదు. మగ సింహాలు అంత బలంగా ఉంటాయి.
— existing in nature (@afaf66551) June 24, 2021
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

