ఆ బుడ్డోడిపై నాగుపాము పగబట్టిందా..? వీడియో వైరల్
నాగుపాము | కింగ్ కోబ్రా.. ఓ బుడ్డోడి వెనుకాలే పరుగులు పెట్టింది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే.. ఆ బుడతడిపై నాగుపాము పగబట్టిందా? అనే సందేహం తప్పక

విష సర్పమైన నాగుపామును చూస్తేనే గుండెల్లో వణుకు పుడుతోంది. కాసేపు చెమటలు పట్టేస్తాయి. అలాంటి కింగ్ కోబ్రా.. ఓ బుడ్డోడి వెనుకాలే పరుగులు పెట్టింది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే.. ఆ బుడతడిపై నాగుపాము పగబట్టిందా? అనే సందేహం తప్పక కలుగుతోంది.
ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే వియత్నాం వెళ్లాల్సిందే.. వియత్నాంలోని ఓ ఇంటి ఆవరణలో ఓ పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడు. తన తాత కూడా అక్కడే నిల్చున్నాడు. తండ్రేమో ఇంటి ద్వారం వద్ద ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు. అంతలోనే నాగుపాము బుసలు కొడుతూ బాలుడి వైపుకు దూసుకొచ్చింది. ఆ పామును చూసిన తాత తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. పిల్లాడిని తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు.. కానీ తనకు ఇటీవలే స్ట్రోక్ రావడంతో అంతగా స్పందించలేకపోయాడు.
ఇక అప్రమత్తమైన తండ్రి.. పరుగెత్తి బాలుడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. నాగుపాము మాత్రం ఆ పిల్లాడి వెంటనే పరుగెత్తింది. కింగ్ కోబ్రాను చంపేందుకు తాత కర్ర తీసుకున్నప్పటికీ.. ధైర్యం చేయలేదు. ద్వారం వద్దకు దూసుకొస్తున్న పామును చూసి తాత కూడా ఇంట్లోకి వెళ్లిపోయాడు. మొత్తానికి గ్లాస్ డోర్‌ను మూసేయడంతో.. పాము ఇంట్లోకి వెళ్లలేకపోయింది. కాసేపు అక్కడ తచ్చాడుతూ.. తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ తర్వాత ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

