Bhuban Badyakar | నేను సెలబ్రిటీని కాదు.. అవసరమైతే మళ్లీ కచ్చాబాదం అమ్ముతా..
Bhuban Badyakar | కచ్చాబాదం సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లికాయ వ్యాపారి భుబన్ బద్యాకర్ (Bhuban Badyakar) వ్యాపారం కోసం సొంతంగా లిరిక్‌ను రాసుకొని ట్యూన్‌ను చేయగా.. ఈ పాట నచ్చిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. తర్వాత ఆ ట్యూన్, లిరిక్ డెవలప్ చేసి ఓ ప్రైవేట్ సాంగ్ చేయగా అది రికార్డు సక్సెస్ సాధించింది.

ఇటీవల సోషల్ మీడియాలో కచ్చా బాదమ్ (Kacha Badam)సాంగ్ రచ్చ చేయగా.. పల్లికాయ వ్యాపారి భుబన్ పలువురికి ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఇప్పుడు తాను సెలబ్రెటినని, ఇకపై పల్లికాయ అమ్మనని, అమ్మితే అవమానకరమంటూ నోరుజారిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు భుబన్ మాట మార్చాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను సాధారణ జీవితం గడుపుతున్నాను. నేను సెలబ్రిటీని కాదు. అవసరమైతే మళ్లీ పల్లికాయ అమ్ముతాను. ఎక్కువ డబ్బు, పాపులారిటీ చేసి మతిస్థిమితం కోల్పోయాను.

కారు కూడా కొన్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు జీవితాల్లో ఎలా గడపాలో అర్థమైంది’ అని తెలిపాడు. ఇంతకు ముందు తాను సెలబ్రిటీనని, మళ్లీ పల్లికాయ అమ్మితే అవమానకరమని అనగా.. పలువురు విమర్శలు గుప్పించారు. రేణుమండల్తో పోల్చారు. ప్రస్తుతం భుబన్‌కు చాలా కంపెనీలు, టీవీ షోల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘కచ్చ బాదం’ పాట తర్వాత భుబన్ మరో రెండు పాటలను కంపోజ్ చేశాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

