Comic Notice | మీ కుక్క ఇబ్బంది పెడుతోంది.. చక్కటి కామిక్స్‌తో పొరుగింటికి నోటీస్
Comic Notice | పక్కింటివారిని అభిమానించే ఓ పెద్దాయన.. వారి కుక్క ఎలా ఇబ్బంది పెడుతుందో చాలా సున్నితంగా వారికి చేరవేశాడు. ఎలాగంటే..
‘ఎక్కడో ఉన్న వారు వచ్చి మనకు గౌరవం ఇస్తారని అనుకోకుండా.. పక్కింటి వారితో సఖ్యతగా ఉంటే నిత్యం గౌరవం దక్కుతుంది’ అని ఓ రచయిత చాలా గమ్మత్తుగా పొరిగింటి వారితో సంబంధాలపై వ్యాఖ్యానించారు. నిజమే కదూ! పక్కింటి వారితో మనం ఎలా ఉంటే అంత గొప్పగా ప్రశాంతత, స్నేహం ఉంటాయి. పక్కింటి వారితో ఇబ్బందులు వస్తే.. వారు జోక్ వేసినా మనకు డోకు వస్తుంది. పక్కింటివారిని అభిమానించే ఓ పెద్దాయన.. వారి కుక్క ఎలా ఇబ్బంది పెడుతుందో చాలా సున్నితంగా వారికి చేరవేశాడు. ఎలాగంటే..
ఓ పెద్దాయన తన సృజనాత్మకతతో కామిక్స్ సృష్టించి పొరుగింటి వారి కుక్క ఎంతగా ఇబ్బంది పెడుతుందో చాలా చక్కగా విన్నవించారు. కుక్క చేష్టలను కామిక్స్‌గా చేత్తేనే ఆర్ట్ వేశాడు. కుక్క పెడుతున్న ఇబ్బందులను వాటి పక్కన రాశాడు. లెటర్‌కు ‘ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ నోటీస్’ అని హెడ్డింగ్ కూడా పెట్టాడు. ఈ లెటర్‌ను పక్కింటి వారి పోస్ట్‌బాక్స్‌లో వేసి వారికి చేరేలా చేయగలిగాడు. ఈ వెరైటీ ఫొటో రెడిట్ ప్లాట్‌ఫాంపై వైరల్‌గా మారింది. ఇప్పటికే 26 వేల మంది ఈ ఫొటోను చూసి ఆయనగారి సృజనాత్మకతను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.
పక్కింటివారితో ప్రతి చిన్న విషయానికి గొడవ పడి ఇబ్బందులు తెచ్చుకోవడం కన్నా ఇలా తెలివిగా సమస్యను వారి దృష్టికి తేవచ్చునని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కుక్క అరుస్తుందంటూ వారం రోజుల క్రితం ఢిల్లీలో పొరుగింటి వారిపై ఓ వ్యక్తి రాడ్డుతో దాడి చేసి ముగ్గుర్ని గాయపరిచిన విషయం తెలిసిందే. కుక్క చేష్టలే కదా అని కొట్టిపారేయకుండా వాటిని అదుపులో పెట్టడంలో వాటి యజమానులు కూడా శ్రద్ధ తీసుకుంటే సమస్యలే ఉండవు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

