Watch: బాలుడి చేతి వేలిని విరిచిన చెస్ రోబో… వైరల్ అయిన వీడియో
మాస్కో: చదరంగం పోటీలో పాల్గొన్న బాలుడి చేతి వేలిని చెస్ రోబో విరిచింది. దీంతో బాలుడి వేలికి గాయమైంది. రష్యా రాజధాని మాస్కోలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 19 ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఏడేళ్ల క్రిస్టోఫర్, చెస్ రోబోతో పోటీ పడ్డాడు. ఆటలో మునిగిన ఆ బాలుడు వేగంగా ఒక ఎత్తు వేశాడు. అయితే ఆ చెస్ రోబో అనూహ్యంగా స్పందించింది. క్రిస్టోఫర్ చూపుడు వేలిని బలంగా నొక్కింది. దీంతో ఆ బాలుడు బాధతో విలవిలలాడిపోయాడు. ఒక మహిళతోపాటు ముగ్గురు వ్యక్తులు వెంటనే ఆ క్రిస్టోఫర్ వద్దకు పరుగున వచ్చారు. బాలుడి చూపుడు వేలిని చెస్ రోబో పట్టు నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ వేలికి గాయమైంది. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించి విరిగిన వేలికి కట్టుకట్టారు.
కాగా, రష్యా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెర్గీ స్మాగిన్ ఈ సంఘటనపై స్పందించారు. బాలుడు సురక్షితంగా ఉన్నాడని, చేతి వేలికి గాయం అయ్యిందని మీడియాకు తెలిపారు. ఆ బాలుడు సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించాడని, చెస్ రోబోకు సమయం ఇవ్వకుండా వేగంగా పావును కదిపాడని చెప్పారు. ఒక క్రీడాకారుడ్ని చెస్ రోబో గాయపర్చడం ఇదే తొలి కేసు అని అన్నారు.
మరోవైపు మాస్కోలోని 9 ఏళ్ల వయసు గ్రూప్నకు చెందిన 30 మంది అత్యున్నత చెస్ ప్లేయర్లలో క్రిస్టోఫర్ ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ‘అంత తొందరపాటు రోబోకు నచ్చలేదు. ఆ బాలుడి చూపుడు వేలును పట్టుకుని గట్టిగా నొక్కింది’ అని పేర్కొంది. అయితే బాలుడు క్రిస్టోఫర్తో చెస్ రోబో ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడినట్లు వెల్లడించింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కలిగిన రోబోలు మానవులను నాశనం చేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
All acquisition that advanced AI will destroy humanity is false. Not the powerful AI or breaching laws of robotics will destroy humanity, but engineers with both left hands :/
On video – a chess robot breaks a kid's finger at Moscow Chess Open today. pic.twitter.com/bIGIbHztar
— Pavel Osadchuk (@xakpc) July 21, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

