Britney spears | నేను ఇంకా బతికే ఉన్నాను.. ఆత్మకథ వార్తలపై బ్రిట్నీ స్పియర్స్ సీరియస్
తన ఆత్మకథ వార్తలపై సీరియస్‌గా స్పందించిన బ్రిట్నీస్పియర్స్
సెల్రబిటీలు, క్రికెటర్లు, సినిమా స్టార్ల తమ ఆత్మకథని వెండితెరమీద చూడాలని ఉంటుంది చాలామందికి. హీరోలు, హీరోయిన్లు కూడా సెలబ్రిటీల నిజజీవిత పాత్రలో నటించి, ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకుంటారు. అయితే, అమెరికాకు చెందిన పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ మాత్రం తన ఆత్మకథని సినిమాగా తీయడం గురించి సీరియస్‌గా స్పందించింది. ‘కొందరు నా జీవితం మీద సినిమా తీయాలనుకుంటున్నారని విన్నాను. డూడ్.. నేను ఇంకా బతికే ఉన్నాను. వాళ్లు నేను చనిపోయానని అనుకుంటున్నట్టు ఉన్నారు. మా కుటుంబం వాళ్లని అడ్డుకుంటుంది’ అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది బ్రిట్నీ. ఈమధ్య ‘ది డ్రూ బారీమోర్’ అనే అమెరికా టాక్‌షోలో బ్రిటన్ నటి మిల్లీ బాబీ బ్రౌన్ మాట్లాడుతూ… తనకు బ్రిట్నీ స్పియర్స్ ఆత్మకథలో నటించాలని ఉందని చెప్పింది.
‘నాకు బ్రిట్నీ స్పియర్స్ ఆత్మకథలో నటించాలని ఉంది. ఆమె జీవితానికి, నా జీవితానికి పోలిక ఉంది. అందుకని నేను అయితే బ్రిట్నీ కథను చాలా చక్కగా చెప్పగలను’ అని మిల్లీ బాబీ తన ఆసక్తిని వెల్లడించింది. ‘స్ట్రేంజర్ థింగ్స్’ అనే వెబ్సిరీలో బిల్లీ బాబీ ఎలెవన్ పాత్రలో నటిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ వెబ్‌సిరీస్ మిల్లీకి బాగా పేరు తెచ్చింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

