ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి అంటారు కదా. అలాగే.. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. చిన్న చిన్న విషయాలకు కూడా అలుగుతుంటారు. బాధపడుతుంటారు. మొహం మాడ్చుకుంటారు. ఎవ్వరితో మాట్లాడరు. తమలో తామే బాధపడతారు. కొంత సేపటి తర్వాత మళ్లీ నవ్వు ముఖం పెడతారు. కొందరు అంతే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పెళ్లి కూతురు కూడా అటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయే. ఎందుకంటే.. ఓవైపు తన పెళ్లి జరుగుతుంటే.. పెళ్లి కోసం అతిథులు వచ్చాక.. పెళ్లి కొడుకు.. పెళ్లిమండపం మీద తన కోసం వెయిట్ చేస్తుంటే.. నేను పెళ్లి మండపం ఎక్కను.. అంటూ మారాం చేసింది. అలిగింది. దీంతో పెళ్లికి వచ్చిన వాళ్లు షాక్ అయిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకమ్మా.. ఎందుకు పెళ్లిమండపం ఎక్కడం లేదు? ఏమైంది.. అని బంధువులు ఆరా తీయగా.. పెళ్లి కూతురుగా నేను ఎంట్రీ ఇస్తున్నప్పుడు.. నేను చెప్పిన పాటను ప్లే చేయలేదు ఎందుకు? అంటూ ఈవెంట్ ఆర్గనైజర్స్తో గొడవేసుకుంది పెళ్లి కూతురు. నేను ముందే చెప్పాను కదా.. ఆ పాట ప్లే చేయమని. నేను పెళ్లి చేసుకోనుపో. నేను అసలు పెళ్లిమండపమే ఎక్కను.. అంటూ అందరినీ ఇబ్బంది పెట్టింది ఆ పెళ్లికూతురు. చివరకు తన కుటుంబ సభ్యులు.. తనను ఓదార్చడంతో ఒక చిరునవ్వు నవ్వి.. పెళ్లి పీటలు మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Wedding Brigade అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లు అయితే.. ఆ వీడియోను చూసి నవ్వలేక చచ్చిపోతున్నారు.