Viral Video | పెళ్లి వేడుకల్లో ఎన్నో సరదా ఘటనలు జరుగుతుంటాయి. అవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరలై నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంటాయి. వధూవరుల ప్రీ వెడ్డింగ్ షూట్లు, వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఏదో ఒక కారణం చేత అవి సోషల్ మీడియాను షేక్ చేసేస్తాయనుకోండి. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నూతన వధూవరులు అందంగా ముస్తాబై స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్నారు. ఎంతో రొమాంటిక్‌గా ఇద్దరూ కాలు కదుపుతూ కనిపించారు. ఇంతలో వరుడు అనుకోకుండా వధువు లెహంగాను తొక్కాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. జైపూర్ ప్రీ వెడ్డింగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో డిసెంబర్ 15న ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.