అండర్వేర్, తువ్వాలతోనే పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి..!
Madhya Pradesh | యువత పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు, చేతి రుమాలు ఇలా.. స్టైల్‌గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు కళాశాలకు వెళ్లేటప్పుడు తోటి విద్యార్థులతో సమానంగా ఉండాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఎంత ఖర్చుపెట్టైనా వారికి అవసరమైన దుస్తులు, బ్యాగ్, పుస్తకాలు, బూట్లు ఇలా అవసరమైన అన్ని వస్తువులు కొనిస్తుంటారు.
Madhya Pradesh | యువత పాఠశాల, కళాశాలకు వెళ్లేటప్పుడు ప్యాంటు, షర్టు, చేతి రుమాలు ఇలా.. స్టైల్‌గా రెడీ అయ్యి వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు కళాశాలకు వెళ్లేటప్పుడు తోటి విద్యార్థులతో సమానంగా ఉండాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఎంత ఖర్చుపెట్టైనా వారికి అవసరమైన దుస్తులు, బ్యాగ్, పుస్తకాలు, బూట్లు ఇలా అవసరమైన అన్ని వస్తువులు కొనిస్తుంటారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి మాత్రం అండర్వేర్, తువ్వాలతోనే కళాశాలకు వెళ్తున్నాడు. ఇది చూసిన కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
‘జంగిల్ బుక్’ సినిమాలోని మోగ్లీని తలపిస్తున్న ఈ యువకుడి పేరు కన్నయ్య. మధ్యప్రదేశ్ బడ్వానీకి చెందిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి దుస్తులు అంటే చిరాకట. ఎవరైనా చొక్కా, ప్యాంటు ధరించాలని చెబితే.. వారితో మాట్లాడడమే మానేసేవాడట. పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు.. తల్లిదండ్రులు కన్నయ్యకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.
బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ యువకుడిని చేర్పించేందుకు వెళ్తే.. యాజమాన్యం ప్రవేశం కల్పించలేదు. చివరకు కలెక్టర్ అనుమతితో ప్రవేశం లభించింది. అయితే, కళాశాలలో కచ్చితంగా దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన కన్నయ్య.. పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. కానీ ఉపాధ్యాయులు అందుకు ఒప్పుకోలేదు. కష్టపడి కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. ఇప్పటికీ ఓ అండర్వేర్, పైనుంచి తువ్వాలు తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించకుండా కాలేజీకి వెళ్తుండడం గమనార్హం.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

