Bag of Air : ఇదేం విడ్డూరం…గాలితో నిండిన ప్లాస్టిక్ కవర్‌ను 5 లక్షలకు అమ్మాడు.. దాని స్పెషాలిటీ ఏంటి?
దేనికైనా ఒక హద్దు ఉంటుంది. లేకపోతే ఏంటి? ఏదైనా విలువైన వస్తువును అమ్మినా.. కొన్నా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు కానీ.. ఏమీ లేని ఒక ప్లాస్టిక్ కవర్‌ను 5 లక్షలకు అమ్మడం.. దాన్ని కొనడం చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది కదా. ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్నది కేవలం గాలి మాత్రమే. ఆ గాలికి అంత డిమాండ్ ఎందుకు. బయట గాలి ఉంటుంది కదా. దాన్ని ప్లాస్టిక్ కవర్లో బంధించి అమ్మాల్సిన అవసరం ఏంటి? అసలు.. ఈ గాలి ప్లాస్టిక్ కవర్ కథాకామీషు ఏంటో తెలుసుకుందాం రండి.

ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్న గాలి.. ఎక్కడిదో తెలుసా? డొండా డ్రాప్ అనే ఒక ఈవెంట్‌కు సంబంధించింది. డొండా డ్రాప్ అంటే అదేదో పచ్చని చెట్లు ఉండే అడవి ప్రాంతం కాబోలు.. ఆ గాలిని పీల్చుకుంటే రోగాలన్నీ మాయం అవుతాయి కాబోలు అని మీలో మీరే ఊహించేసుకోకండి. ఎందుకంటే.. అది ఒక కన్సర్ట్కు సంబంధించిన ఈవెంట్ దగ్గర నింపిన గాలికి సంబంధించిన కవర్.
మీకు ఫేమస్ అమెరికన్ పాప్ స్టార్ కన్యె వెస్ట్ తెలుసా? ఆయన పాప్ సింగర్, ర్యాపర్. యూఎస్‌లో కన్యె వెస్ట్ అంటే పడి చచ్చిపోతారు జనాలు. ఆయన రాప్ సాంగ్స్ పాడితే మామూలుగా ఉండదు. ఆయన త్వరలో డొండా అనే ఒక ఆల్బమ్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. దాని కోసం ప్రివ్యూ కన్సర్ట్ను అట్లాంటాలోని మెర్సిడిస్ బెంజ్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. జులై 22న కన్సర్ట్ను ఏర్పాటు చేయగా.. ఒక వ్యక్తి ఆ కన్సర్ట్కు వెళ్లి.. ఆక్కడ స్టేడియంలో గాలిని ప్లాస్టిక్ కవర్లో నింపి దాన్ని ఈబేలో వేలం వేశాడు.
కెన్యె వెస్ట్ కన్సర్ట్ నుంచి తీసుకొచ్చిన గాలి.. అంటూ క్యాప్షన్ పెట్టి వేలం వేయగానే.. దాన్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారు. చివరకు దాన్ని ఓ వ్యక్తి 7600 డాలర్లకు కొనుగోలు చేశాడు. అంటే మన కరెన్సీలో 5,64,235 రూపాయలు అన్నమాట. విచిత్రంగా ఉంది కదా. ఇంతకీ దాన్ని కొన్న వ్యక్తి ఆ గాలిని ఏం చేసుకుంటాడంటారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

