Alligator Attacks Man : ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
ఈత కొడుతున్న వ్యక్తిపై మొసలి దాడి | మొసళ్లను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం. దడుసుకుంటాం. అటువంటిది ఓ మొసలి
మొసళ్లను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం. దడుసుకుంటాం. అటువంటిది ఓ మొసలి చెరువలో ఈదుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసిందంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఆ వ్యక్తి ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. మొసలి ఒక్కసారి అటాక్ చేసిందంటే ఇక వదలదు. ఏనుగునే తన బలంతో లాగేంత శక్తి ఉంటుంది మొసలికి. మనుషులం ఎంత.

తాజాగా చెరువులో ఈదుతున్న ఓ వ్యక్తిపై మొసలి అటాక్ చేసింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ ప్లేస్‌లో ఉన్న చెరువులో ఓ వ్యక్తి ఈత కొడుతున్నాడు. వెనుక నుంచి వేగంగా పెద్ద మొసలి అతడి వైపు వచ్చింది. మొసలి రావడాన్ని ఆ వ్యక్తి పసిగట్టలేదు. వెంటనే అతడిపై దాడికి ప్రయత్నించింది. మొసలి దాడి చేస్తుందని తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే వేగంగా ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ.. తన ఎడమ చేతికి మాత్రం గాయం అయిందని ఆ వీడియో తీసిన వ్యక్తి చెప్పాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
(Video Courtesy : NDTV Youtube Channel)
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sandwich: బుల్లెట్ బండి మీద శాండ్విచ్ అమ్ముతున్నాడు.. వీడియో వైరల్
Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

