గ్రహాంతరవాసులు ఉంటారని చాలామంది నమ్ముతుంటారు. ఎక్కడ ఏ వింతజీవి కనిపించినా ఏలియన్ అనే పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అయితే, ఆస్ట్రేలియాలోని ఓ బీచ్లో కనిపించిన ఓ వింతజీవి కళేబరాన్ని చూసికూడా అంతా ఏలియన్ అని నిర్ధారణకు వచ్చారు. ఈ కళేబరానికి సంబంధించిన వీడియోను ఓ యంగ్బ్లాగర్ సోషల్మీడియాలో పెట్టాడు. దీంతో అది వైరల్గా మారింది.
ఈ వింత జీవి కళేబరం ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సన్షైన్ తీరప్రాంతం కాటన్ ట్రీ బీచ్ ఒడ్డున అలెక్స్ టాన్ అనే పర్యాటకుడి కంటపడింది. దీంతో ఆయన వీడియో తీసి, ఇదేంటని ప్రశ్నిస్తూ ఇన్స్టాలో వీడియో పెట్టాడు. తాను ఇంతకుముందు ఈజీవిని చూడలేదని చెప్పాడు. తాను గ్రహాంతరవాసి అని అనుకుంటున్నానని ఉటంకించాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. చాలామంది అది ఏలియన్ కళేబరమే అని తేల్చేశారు. బీచ్లో వింతజీవి మృతదేహం.. అది ఏలియనే అంటూ థంబ్నెయిల్ పెట్టి వీడియోలను వైరల్ చేశారు..
కాగా, క్రీన్స్ల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ జాన్స్టన్ ఈ మిస్టరీ గుట్టువిప్పారు. అది ఏలియన్ కాదని తేల్చిపారేశారు. అది బ్రష్టెయిల్ పోసమ్ అనే జంతువు కళేబరమని నిర్దారించారు. వరదల్లో అది కొట్టుకొని రావొచ్చని చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.