Viral News | మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ.. ఎక్కడో తెలుసా..?
Viral News | ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో ఎక్కువగా విన్న పదం సరోగసి. ఇందుకు ప్రధాన కారణం పలువురు సెలబ్రిటీలు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. తాజాగా అమెరికాలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 56 ఏళ్ల మహిళ తన కుమారుడు, కోడలి కోసం సరోగసి ద్వారా ఐదో బిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్చర్యపోతున్నారా... ? ఇలాంటి ఘటన ఎప్పుడూ విని ఉండరు కదూ..! అవును, మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Viral News | ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో ఎక్కువగా విన్న పదం సరోగసి. ఇందుకు ప్రధాన కారణం పలువురు సెలబ్రిటీలు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. తాజాగా అమెరికాలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 56 ఏళ్ల మహిళ తన కుమారుడు, కోడలి కోసం సరోగసి ద్వారా ఐదో బిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్చర్యపోతున్నారా… ? ఇలాంటి ఘటన ఎప్పుడూ విని ఉండరు కదూ..! అవును, మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని ఉతహ్ ప్రాంతంలో నివాసం ఉండే జెఫ్ హౌక్, కేంబ్రియా దంపతులు. వీరికి ఇప్పటికే నలుగురు పిల్లలున్నారు. మరో బిడ్డను కనాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కేంబ్రియా గర్భం తీసేయాల్సి వచ్చింది. దీంతో వారు మరో బేబీని పొందే అవకాశం లేకుండా పోయింది. ఇతర మార్గాల్లో బిడ్డను పొందేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్న సమయంలో జెఫ్ తల్లి 56ఏళ్ల నాన్సీ హౌక్ వారికి ఓ సలహా ఇచ్చింది.
సరోగసి ద్వారా ఐదో బిడ్డను తానే కంటానని తెలిపింది. అయితే ఇందుకు కుమారుడు, కోడలు ముందు ఒప్పుకోలేదు. చివరకు ఒప్పించి కొడుకు, కోడలి ఐదో బిడ్డకు నాన్సీ జన్మనిచ్చింది. ఆ పాపకు హన్హ అని నామకరణం కూడా చేశారు. ఈ విషయాన్ని కేంబ్రియా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. నాన్సీ బేబీబంప్ ఫొటోలు సైతం పంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

