వెల్నెస్లో మనమే ఫస్ట్

- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో
- తెలంగాణకు రెండు అవార్డులు
- వెల్సెన్ యాక్టివిటీస్‌లో తొలి స్థానం
- ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండోస్థానం
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రమని మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి. వెల్సెన్ యాక్టివిటీస్‌లో దేశంలోనే మొదటి స్థానం, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో రాష్ట్రం నిలిచింది. యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే-2021 సందర్భంగా ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందజేసింది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎన్హెచ్ఏ సీఈవో ఆర్ఎస్ శర్మ, ఏఎస్ఎండీ వికాస్ శీల్ తదితరుల చేతుల మీదుగా రాష్ట్ర సిబ్బంది ఈ అవార్డులను అందుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 13 వరకు ‘హెల్తీ అండ్ ఫిట్ నేషన్’ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సబ్‌సెంటర్ల స్థాయిలో మూడు లక్ష్యాలను నిర్దేశించింది. ఒక సబ్‌సెంటర్ పరిధిలో కనీసం 100 మందికి ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) స్క్రీనింగ్ చేయాలని, 10 వెల్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని, కనీసం 100 డిజిటల్ ఐడీలు సృష్టించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణలో వైద్య సిబ్బంది సబ్‌సెంటర్ల పరిధిలో నిర్వహించిన విస్తృత కార్యక్రమాలకుగాను రాష్ర్టానికి రెండు అవార్డులు దక్కాయి.
వైద్య సిబ్బందికి అభినందనలు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణను రెండు క్యాటగిరీల్లో విజేతగా నిలిపిన వైద్య సిబ్బందికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర వైద్యరంగం బలోపేతమైందని మరోసారి నిరూపితమైందన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే సందర్భంగా రాష్ట్ర వైద్య సిబ్బంది అవార్డులను అందుకున్నారని వివరిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో 20 లక్షల మందిని స్క్రీనింగ్ చేశాం
వెల్నెస్ యాక్టివిటీస్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పల్లె దావాఖానల్లో ప్రజలకు ఆర్యోగ సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, యోగా, ధ్యానం తదితర అంశాలపై అవగాహన కల్పించాం. ఎన్సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 20లక్షల మందిని స్క్రీనింగ్ చేశాం. వీటిని గుర్తించిన కేంద్రం రాష్ర్టానికి రెండు అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది.
-వాకటి కరుణ, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

