కాలనీలోనే టీకా క్యాంప్
- పని ప్రాంతాల్లోనూ ప్రత్యేక డ్రైవ్
- 18 ఏండ్లు నిండినవాళ్లందరికీ టీకా
- అన్ని ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సిన్లు
- ఒక్కో డోస్‌కు సర్వీస్ చార్జి రూ.150
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనున్నది. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, పని ప్రదేశాలకు టీకా క్యాంపులు తరలిరానున్నాయి. అదే సమయంలో సూపర్ స్ప్రెడర్లకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, వ్యాక్సిన్లు ఇవ్వనున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు దవాఖానల్లో టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవి విద్యాసంస్థలు, కంపెనీలు వంటి పని ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, టీకా పంపిణీ చేయవచ్చని పేర్కొన్నది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే టీకాలు వేయాలని స్పష్టంచేసింది. 18 ఏండ్లు నిండినవారందరికీ టీకాలు వేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పర్యవేక్షిస్తారని పేర్కొన్నది.
ఇవీ మార్గదర్శకాలు..
- కొత్తగా టీకా కేంద్రాలుగా మారే ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు ముందుగా కొవిన్ యాప్‌లో రిజిస్టర్ కావాలి. ఇప్పటికే ఉన్న టీకా కేంద్రాలకు మినహాయింపు.
- ప్రైవేట్ దవాఖానల్లో ఒక్కో డోస్‌కు సర్వీస్ చార్జ్ రూ.150 మాత్రమే వసూలు చేయాలి.
- ఆయా కేంద్రాల్లో టీకాలు తీసుకొనే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసుకోవాలి. వారికి ఆన్లైన్ సర్టిఫికెట్లను మంజూరుచేయాలి.
- వ్యాక్సిన్ రవాణా, నిల్వ సదుపాయాలు, టీకాలు వేసేందుకు తగినన్ని గదులు, వెయింటింగ్ రూమ్‌లు, శిక్షణ పొందిన సిబ్బంది, ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు ఉన్న ఏ ప్రైవేట్ దవాఖాన అయినా టీకా కేంద్రంగా రిజిస్టర్ కావొచ్చు.
- ఏదేని పరిశ్రమకు అనుబంధంగా ఉండే దవాఖాన ఉంటే కొవిడ్ టీకా కేంద్రంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- అనుబంధ దవాఖానలు లేని పరిశ్రమలు ‘ఇండస్ట్రియల్ వర్క్‌ప్లేస్ టీకా కేంద్రం’గా రిజిస్టర్ చేసుకోవచ్చు.
- విద్యాసంస్థలు, గేటెడ్ కమ్యూనిటీల్లో దవాఖాన అందుబాటులో ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే ఏదేని ప్రైవేట్ దవాఖానతో ఒప్పందం కుదుర్చుకొని వ్యాక్సిన్లు వేసుకోవచ్చు.
- ప్రైవేట్ టీకా కేంద్రాల నిర్వాహకులు వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి నేరుగా టీకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
- తమ వద్ద ఏయే టీకాలు, ఎంత మోతాదులో అందుబాటులో ఉన్నాయో, వాటి ధరలు ఎంతో ఎప్పటికప్పుడు కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి.
- ముందస్తు రిజిస్ట్రేషన్ ఉన్నవారికి మాత్రమే టీకాలు వేయాలి. ఒకవేళ వయల్ తెరిచిన తర్వాత టీకాలు వృథా అవుతాయని భావించినప్పుడు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సిన్ వేయవచ్చు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

