ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ ఏదో తెలుసా?

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా చైనా నిలిచింది. మిలిటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ చేసిన అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. భారీ బడ్జెట్లు కేటాయించినా కూడా ఈ లిస్ట్‌లో అమెరికా రెండోస్థానంలో నిలిచినట్లు ఈ స్టడీ వెల్లడించింది. ఇక ఇందులో ఇండియా నాలుగో స్థానంలో నిలవడం విశేషం. 100 పాయింట్లకుగాను చైనా మిలిటరీకి 82, అమెరికా 74, రష్యా 69, ఇండియా 61, ఫ్రాన్స్ 58 సాధించి టాప్ 5లో నిలిచాయి. యునైటెడ్ కింగ్డమ్ 43 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఎలా తేల్చారు?
అల్టిమేట్ మిలిటరీ స్ట్రెంత్ ఇండెక్స్ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో బడ్జెట్, క్రియాశీలంగా ఉన్న మిలిటరీ సిబ్బంది, మొత్తం గగన, సముద్ర, ఉపరితల, అణ్వాయుధ సంపత్తి, సగటు జీతాలు, పరికాల బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ మిలిటరీ బడ్జెట్ మాత్రం అమెరికాదే. ఆ దేశం ఏడాదికి 73200 కోట్ల డాలర్ల బడ్జెట్‌ను రక్షణ రంగానికి కేటాయిస్తుంది. చైనా 26100 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో, 7100 కోట్ల డాలర్లతో ఇండియా మూడోస్థానంలో ఉన్నాయి. ఇక సముద్ర యుద్ధంలో చైనా, గగనతలంలో అమెరికా, ఉపరితలంపై రష్యా బలంగా ఉన్నట్లు కూడా ఈ స్టడీ తేల్చింది.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

