పిల్లలకు వ్యాక్సిన్!
- 4 నెలల్లోగా ఆమోదం లభించొచ్చు
- చిన్నారులకు థర్డ్‌వేవ్ ప్రమాదమనేందుకు ఆధారాల్లేవు
- స్టెరాయిడ్లపై నియంత్రణ లేకే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి
- ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా

న్యూఢిల్లీ, మే 21: పెద్దల కంటే పిల్లలపైనే థర్డ్‌వేవ్ అధిక ప్రభావం చూపనుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం సహజంగానే తక్కువగా ఉన్నందున థర్డ్‌వేవ్‌లోనూ వారికి పెద్దగా ప్రమాదం ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పిల్లల రక్షణకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, వచ్చే మూడు నాలుగు నెలల్లో టీకాలకు ఆమోదం లభించే అవకాశం ఉన్నదని చెప్పారు. కుటుంబంలోని పెద్దవారందరికీ కరోనా వైరస్ సోకినా, పిల్లలకు ముప్పు తక్కువేనని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. దేశంలో మ్యుకోర్మైకోసిస్ (బ్లాక్‌ఫంగస్) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ను అరికట్టడానికి మరింత పటిష్ఠమైన చర్యలు చేపట్టాల్సి ఉన్నదన్నారు.
కొవిడ్ కేసులు తగ్గితే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. అయితే దీనిని బ్లాక్ ఫంగస్ అని పిలువడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ఇది మ్యుకోర్మైకోసిస్.. బ్లాక్ ఫంగస్కాదు. రక్త సరఫరా తగ్గడంతో చర్మం రంగు మారి నల్లగా అవడంతో దీన్ని బ్లాక్ ఫంగస్ అంటున్నారు’ అని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడడం, డయాబెటిస్ వంటి రుగ్మతల కారణంగా మ్యుకోర్మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తున్నాయని చెప్పారు. షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలని, స్టెరాయిడ్ల వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించారు. బ్లడ్ థిన్నర్ల (బ్లడ్ క్లాట్లను నిరోధించేవి) వినియోగంపై స్పందిస్తూ.. ‘తేలికపాటి అనారోగ్యం ఉన్నవారు బ్లడ్ థిన్నర్లు వినియోగించకూడదు. అధిక వినియోగం వల్ల అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదమున్నది’ అని పేర్కొన్నారు.

వ్యవధి పెంపు సరైనదే
మూడు, నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అని ప్రశ్నించగా.. ‘వైరస్ ఉత్పరివర్తనం చెందుతున్నందున వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తున్నాయో అధ్యయనం చేయాల్సి ఉన్నది. సమీప భవిష్యత్తులో మనం బూస్టర్ డోస్ తీసుకోవాల్సి రావచ్చు. లేదా తరచూ వ్యాక్సిన్లు తీసుకునే అవసరం పడొచ్చు’ అని అన్నారు. టీకాల మధ్య వ్యవధి పెంపు సరైనదేనని గులేరియా సమర్థించారు. వ్యవధి పెంచితే వ్యాధి నిరోధకత పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధంపై ఆయన స్పందిస్తూ.. దీన్ని గేమ్‌చేంజర్ అనడం తొందరపాటు అవుతుందని చెప్పారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

