కొత్త మార్గదర్శకాలు
- హోంఐసోలేషన్ రోగులకు కేర్‌టేకర్ ఉండాల్సిందే
- కుటుంబ సభ్యులు.. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మంచిది
- రోగులు, కుటుంబీకులు మూడు పొరల మాస్కులు ధరించడం మేలు
- పది రోజుల తర్వాత రోగులు ఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు
- హోం ఐసోలేషన్ వారి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు
- చివరి 3 రోజుల్లో జ్వరం లేకుంటే టెస్టు వద్దు

న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్-19 లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. హోం ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని, చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరంలేదని కేంద్రం ఈ మార్గ్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఐసోలేషన్‌లో ఎవరు ఉండాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

- స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు లేని రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించాలి.
- రోగులు ఇంటికే పరిమితమవ్వాలి. బయటకు రావొద్దు.
- ఐసోలేషన్‌లో ఉండేవారికి సహాయం అందించేందుకు అన్నివేళలా కేర్‌టేకర్ ఉండాలి.
- ఐసోలేషన్ ముగిసేంతవరకూ రోగికి సంబంధించిన చికిత్స కోసం కేర్‌టేకర్‌కు, ఏదైనా దవాఖాన సిబ్బందికి మధ్య అనుసంధానం ఉండాలి. రోగుల ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పరీక్షించాలి.
- 60 ఏండ్లు పైబడిన వారిని, రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, ఊపిరితిత్తులు/కాలేయం/మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, సెరెబ్రో-వస్కులర్ వ్యాధులు ఉన్నవారిని వైద్యులు అనుమతించిన తర్వాతనే హోంఐసోలేషన్లో ఉంచాలి.
- రోగికి సాయం చేసే కేర్‌టేకర్, కుటుంబ సభ్యులు.. వైద్యుల సలహాతో హైడ్రాక్సీక్లోరోక్విన్, ప్రోపిలాక్సీస్ ఔషధాలను వాడాలి.
ఇవి చేయండి!

- రోగులు గోరువెచ్చని నీటిని పుక్కిలించడం, రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం చేయాలి.
- ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు సంబంధిత వైద్యుని సలహాతో మందులు వాడాలి.
- రోజుకు 4సార్లు పారాసెటమాల్ 650 ఎంజీ వాడినప్పటికీ జ్వరం తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించాలి. నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లెమేటరీ డ్రగ్ (ఎన్ఎస్ఏఐడీ) (ఉదాహరణకు.. రోజుకు 2సార్లు నెప్రోక్సెన్ 250 ఎంజీ)ను వైద్యులు ఇవ్వొచ్చు.
- బాధితులు, కేర్టేకర్లు మూడు పొరల మాస్కు వాడకం మంచిది. రోగులు వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలి.
- తేలికపాటి లక్షణాలుంటే నోటి ద్వారా స్టెరాయిడ్లు తీసుకోవద్దు. వారం రోజులైనా జ్వరం, దగ్గు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
- పది రోజుల అనంతరం హోంఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు. చివరి మూడు రోజుల్లో జ్వరం లేకపోతే పరీక్ష అవసరంలేదు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

